వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లంక ఎందుకు దివాళా తీసిందంటే ? కారణాలు చెప్పిన ప్రధాని మహీంద-జాతినుద్దేశించి ప్రసంగం

|
Google Oneindia TeluguNews

శ్రీలంక ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకుని విలవిల్లాడుతోంది. రాజపక్స కుటుంబ సభ్యులైన అధ్యక్షుడు,ప్రధాని, పలువురు మంత్రులు, కీలక స్ధానాల్లో ఉన్నవారు ఆర్ధిక వ్యవహారాల్ని చక్కదిద్దడంలో చూపిన నిర్లక్ష్యం ఆ దేశానికి శాపంగా మారిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మహీంద రాజపక్స ఇవాళ జాతినుద్దేశించి ప్రసంగించారు.

బలహీనమైన ఆర్థిక వ్యవస్థలో కోవిడ్ లాక్‌డౌన్ విదేశీ నిల్వలను క్షీణించేలా చేసిందని శ్రీలంక ప్రధాన మంత్రి మహీందా రాజపక్స తెలిపారు. దేశంలో చెలరేగుతున్న ఆర్థిక సంక్షోభం, నిరసనలను వివరించేందుకు ఆయన ఇవాళ జాతినుద్దేశించి ప్రసంగించారు. 1948లో బ్రిటన్ నుండి స్వాతంత్ర్యం పొందినప్పటి నుంచి చూస్తే ఇదే అత్యంత బాధాకరమైన తిరోగమనం అని ఆయన తెలిపారు. దీంతో శ్రీలంకవాసులపై రికార్డు ద్రవ్యోల్బణం, సాధారణ బ్లాక్‌అవుట్‌లతో పాటు ఆహారం, ఇంధన కొరతలు పూర్తిగా దుస్దితిలోకి నెట్టినట్లు మహీంద తెలిపారు.

in his address to nation, sri lankan pm mahinda rajapaksa explained reasons for crisis

కోవిడ్ మహమ్మారిని ఎదుర్కొన్న వెంటనే ఈ సంక్షోభం ఎదురైనట్లు మహీంద వెల్లడించారు. దేశ ఆర్థిక వ్యవస్థ క్షీణిస్తున్నట్లు తెలిసినప్పటికీ, లాక్డౌన్ విధించవలసి వచ్చిందని ఆయన తెలిపారు. అందుకే విదేశీ నిల్వలు క్షీణించాయని ప్రధాన మంత్రి మహింద రాజపక్స అన్నారు. ప్రస్తుత సంక్షోభం నుంచి శ్రీలంకను ఎలా బయటపడేయాలనే దానిపై పరిష్కారాలను రూపొందించడానికి అధ్యక్షుడు గోటబాటతో పాటు తానూ ప్రతి క్షణాన్ని వెచ్చిస్తున్నట్లు మహీంద వెల్లడించారు.

దేశంలో నిరసనల నేపథ్యంలో సాంప్రదాయ సింహళీ, తమిళ నూతన సంవత్సరానికి అనుగుణంగా మహీంద ప్రభుత్వం గత వారం అదనపు ప్రభుత్వ సెలవులను ప్రకటించింది. ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనను విరమించుకోవాలని నిరసనకారులకు ప్రధాని మహీంద ఇవాళ విజ్ఞప్తి చేశారు. వీధుల్లో గడిపే ప్రతి నిమిషం డాలర్ ప్రవాహాన్ని కోల్పోతుందని ఆయన గుర్తుచేశారు. 2010లో యుద్ధంలో గెలిచిన తర్వాత ఎన్నికల్లో గెలిచామని, ప్రజలు కథను మరచిపోయారని మహీంద తెలిపారు. కానీ తనకు గుర్తుందన్నారు. భవిష్యత్తులో ఎప్పటికీ బ్లాక్‌అవుట్‌లు ఉండవని హామీ ఇచ్చారు.

English summary
sri lanka prime minister mahinda rajapaksa has revealed reasons behind economic crisis in his address to nation today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X