పాక్ మోడల్ హత్య షాకింగ్: చంపితే వెసులుబాటు..

లాహోర్: పాకిస్తాన్ హాట్ మోడల్, నటి కండీల్ బలోచ్ హత్య కేసులో షాకింగ్ విషయాలు వెలుగు చూస్తున్నాయి. పాక్‌లోని పంజాబ్ ప్రావిన్సులో ఓ వెసులుబాటు ఉందని, ఆ కారణంగానే ఆమె సోదరుడు వసీం ఆమెను హత్య చేశాడనే వాదనలు వినిపిస్తున్నాయి.

కుటుంబ సభ్యులను ఎవరైనా హత్య చేస్తే, ఇతర కుటుంబ సభ్యులు ఆ హత్యను సమర్థిస్తే, ఆ కేసులో శిక్ష పడదంటున్నారు. దీనిని వినియోగించుకునే ఖండీల్ బలోచ్‌ను హత్య చేసేందుకు ఓ మత పెద్ద, బలోచ్ మాజీ భర్త హుస్సేన్... ఆమె సోదరుడు వసీంను ప్రోత్సహించారని తెలుస్తోంది.

పంజాబ్ ప్రావిన్సులో ప్రముఖ ఇస్లాం మతగురువు అద్బుల్ ఖవి ఒడిలో ఖండీల్ బలోచ్ కూర్చొని సెల్ఫీ తీసుకుంది. ఈ ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. దీంతో, ఖవిని మత గురువుగా తొలగిస్తూ ఫత్వా జారీ అయింది.

In Rare Move, Pakistan Bars Qandeel Baloch's Family From 'Forgiving' Son

ఫత్వాలే చట్టాలైన పాక్‌లో, ఇది సదరు మత పెద్ద ఖవి మనసులో ఖండీల్ బలోచ్ పైన ఆగ్రహాన్ని పెంచింది. దీంతో తన అనుచరుడైన మహ్మద్ వసీంను రెచ్చగొట్టాడు. ఇతను మరోవైపు ఆమెకు తలాక్ చెప్పిన భర్తతో సత్సంబంధాలు కలిగి ఉండడం విశేషం.

దీంతో వసీంను ఖవి రెచ్చగొట్టి ఆమెను చంపేలా ప్రోత్సహించాడు. ఆమెను చంపేసినా వసీంను కుటుంబం వదులుకోదని, క్షమిస్తుందని ఆయన సూచించడంతో ఈ హత్య జరిగిందని తెలుస్తోంది. మరోవైపు, పంజాబ్ పోలీసు అధికారులు నిందితుడిని క్షమించకూడదని ఆదేశాలు జారీ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+