• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉక్రెయిన్‌పై పంజా విసిరిన రష్యా - కీలక భూభాగాలన్నీ విలీనం: పుతిన్‌కు షాకిచ్చిన భారత్

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: రష్యా-ఉక్రెయిన్ మధ్య నెలల తరబడి కొనసాగుతున్న యుద్ధంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటోన్నాయి. ఇప్పటివరకు తాను సొంతం చేసుకున్న భూభాగాలన్నింటినీ రష్యా విలీనం చేసుకుంది. ఈ మేరకు రెఫరెండాన్ని నిర్వహించింది. ఓటింగ్ ద్వారా ప్రజాభిప్రాయాన్ని సేకరించింది. ఆ భూభాగాలు తమ దేశంలో విలీనమైనట్లూ ప్రకటించుకుంది. అయిదురోజుల పాటు ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని చేపట్టింది రష్యా.

రెఫరెండం పట్ల..

రెఫరెండం పట్ల..

దీనిపట్ల అంతర్జాతీయంగా తీవ్ర ఆందోళన వ్యక్తమౌతోంది. అగ్రరాజ్యం అమెరికా సహా పలుదేశాలు- రష్యా చర్యలను తప్పు పట్టింది. భారత్ కూడా దీనికి మినహాయింపేమీ కాదు. ఉక్రెయిన్‌కు చెందిన కీలక భూభాగాలను రష్యా విలీనం చేసుకోవడం పట్ల అసంతృప్తినీ వ్యక్తం చేసింది. అటు ఐక్యరాజ్యసమితి ఈ చర్య పట్ల మండిపడింది. దీన్ని చట్టవిరుద్ధమైన రెఫరెండంగా అభివర్ణించింది. దీనిపై ఐక్యరాజ్య సమితి భద్రత మండలిలో ఓటింగ్‌ను నిర్వహించింది.

ఓటింగ్‌కు దూరంగా..

ఓటింగ్‌కు దూరంగా..

ఈ ఓటింగ్‌కు భారత్ దూరంగా ఉంది. తన తటస్థ వైఖరిని కొనసాగించింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలైనప్పటి నుంచీ భారత్ తటస్థంగానే ఉంటూ వస్తోన్న విషయం తెలిసిందే. ఐక్యరాజ్యసమితి భద్రత మండలిలో ఇప్పటివరకు నిర్వహించిన పలు తీర్మానాలు, ఓటింగ్‌లల్లో భారత్ పాల్గొనలేదు. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని, హింసాత్మక చర్యలు, ఉద్రిక్త పరిస్థితులు, యుద్ధ వాతావరణాన్ని నివారించాలంటూ భారత్ చెబుతూ వచ్చింది.

 ఆ నాలుగు భూభాగాలు..

ఆ నాలుగు భూభాగాలు..

యుద్ధానికి దిగిన తరువాత ఉక్రెయిన్‌కు చెందిన లుహాన్స్క్, డొనెట్స్క్, ఖెర్సన్, జపోరిజ్జియా ప్రాంతాలను రష్యా స్వాధీనం చేసుకుంది. ఈ నాలుగు భూభాగాలను రష్యాలో విలీనమైనట్లు తాజాగా ప్రకటించింది. దీనికోసం కిందటి నెల 23 నుంచి 27వ తేదీ వరకు రెఫరెండాన్ని నిర్వహించింది. ఓటింగ్ ద్వారా ప్రజాభిప్రాయాన్ని సేకరించింది. ఈ రెఫరెండాన్ని తాము గుర్తించట్లేదంటూ ఐక్యరాజ్యసమితి ప్రకటించింది.

10 దేశాలు అనుకూలంగా..

10 దేశాలు అనుకూలంగా..

ఈ రెఫరెండం చట్టవిరుద్ధమంటూ భద్రతమండలిలో ఓటింగ్‌ను నిర్వహించింది ఐక్యరాజ్య సమితి. 15 దేశాలు ఇందులో పాల్గొన్నాయి. 10 దేశాలు తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశాయి. మూడు దేశాలు తమ ఓటు హక్కును వినియోగించుకోలేదు. భారత్, చైనా, గబన్ ఓటింగ్‌లో పాల్గొనలేదు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత రాయబారి రుచిరా కాంభోజ్ మాట్లాడారు.

భారత్ అభిప్రాయం ఇదే..

భారత్ అభిప్రాయం ఇదే..

ఉక్రెయిన్‌లో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాల పట్ల తాము తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోన్నామని తేల్చిచెప్పారు. యుద్ధానికి భారత్ ఎప్పుడూ వ్యతిరేకమేనని పేర్కొన్నారు. హింసాత్మక పరిస్థితులను ఎవరూ సమర్థించబోరని, శాంతియుత వాతావరణాన్ని పునరుద్ధరించడానికి ప్రయత్నించాలని సూచించారు. విభేదాలు, వివాదాలను పరిష్కరించుకోవడానికి చర్చలు ఒక్కటే మార్గమని రచిర కాంభోజ్ పునరుద్ఘాటించారు.

చర్చల ద్వారా..

చర్చల ద్వారా..

శాంతి మార్గంలో దౌత్య సంబంధాల ద్వారా చర్యలను పరిష్కరించుకోవాల్సి ఉంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలుమార్లు చెప్పారని ఈ విషయాన్ని ఆయన రష్యా, ఉక్రెయిన్ అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్, వొలొదిమిర్ జెలెన్‌స్కీని సూచించారని, తన అభిప్రాయాలను ఆయన నిస్సంకోచంగా తెలియజేశారని చెప్పారు. ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ సైతం ఇదే విషయాన్ని ప్రకటించారని గుర్తు చేశారు.

English summary
India abstained on a draft UN Security Council resolution that condemns Russia's 'illegal referenda' and annexation of four Ukrainian territories.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X