ఇజ్రాయెల్-గాజా: యుద్ధ నేరాల ఉల్లంఘనలపై దర్యాప్తు: యూఎన్‌హెచ్ఆర్సీ ఓటింగ్‌కు భారత్ దూరం

న్యూయార్క్: గాజా-ఇజ్రాయెల్ మధ్య సైనిక ఘర్షణలో యుద్ధనేరాల ఉల్లంఘనలపై దర్యాప్తు కోరుతూ ఐక్యరాజ్యసమితి(యూఎన్) మానవ హక్కుల కౌన్సిల్ (యూఎన్‌హెచ్ఆర్సీ)లో జరిగిన ఓటింగ్‌కు భారత్ గైర్హాజరైంది. ఈ ఓటింగ్‌లో తీర్మానానికి అనుకూలంగా 24 దేశాలు ఓటు వేయగా, వ్యతిరేకంగా 9 దేశాలు ఓటు వేశాయి. 14 దేశాలు గైర్హాజరయ్యాయి. దీంతో తీర్మానం ఆమోదం పొందింది.

చైనా, రష్యాలో ఈ తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయడం గమానార్హం. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కౌన్సిల్‌లో జరిగిన ఓటింగ్‌లో ఓ తీర్మానాన్ని ఆమోదించింది. పాలస్తీనా భూభాగంలో మానవహక్కుల చట్టాలు అమలు చేసేలా ఈ తీర్మానం జరిగింది. ఇది ఇజ్రాయెల్, తూర్పుజెరూసలెంకు కూడా వర్తిస్తుందని యూఎన్ హెచ్ఆర్సీ వెల్లడించింది.

 India abstains on UNHRC resolution proposing probe in Gaza violence

ఈ సమావేశంలో పాలస్తీనా-తూర్పుజెరూసలెంలో మానవహక్కుల పరిస్థితిపై చర్చించారు. ఈ వివాదంలో అన్ని పక్షాలు హింస, ఘర్షణలు పెరగకుండా సహనం వహించాలని, ప్రస్తుతం తూర్పు జెరూసలెం సహా అన్ని చోట్ల యథాతథ పరిస్థితి కొనసాగించాలని ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత రాయబారి మణిపాండే స్పష్టం చేశారు. జెరూసలెంలో హింస కొనసాగడంపై ఆందోళన వ్యక్తం చేశారు.

మొదట గాజా.. ఇజ్రాయెల్‌పై బాంబులతో విరుచుకుపడిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఇజ్రాయెల్ కూడా బాంబు దాడులకు దిగింది. దీంతో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక భవనాలు నేలమట్టామయ్యాయి. ఈ సమయంలో చెలరేగిన ఘర్షణల్లో అనేక మంది గాయాలపాలయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+