ఐ లవ్ ఇండియా.. ఐ లవ్ చైనా: రెండూ కావాల్సిన దేశాలే: ట్రంప్ స్నేహగీతం: ఏమైనా..ఎందాకైనా
వాషింగ్టన్: లఢక్ సమీపంలో వాస్తవాధీన రేఖ విషయంలో భారత్-చైనా మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, యుద్ధ వాతావరణాన్ని నియంత్రించడంపై అగ్రరాజ్యం అమెరికా మళ్లీ ఫోకస్ పెట్టింది. ఈ రెండు దేశాల మధ్య మధ్యవర్తిత్వాన్ని నిర్వహించడానికి తాము ముందుంటామని మరోసారి స్పష్టం చేసింది. ఇదివరకే పలుమార్లు ఈ అంశాన్ని ప్రస్తావించిన అమెరికా మరోసారి పాత ప్రతిపాదనను తెరమీదికి తీసుకొచ్చింది. రెండు శక్తిమంతమైన దేశాల మధ్య ఉద్రిక్తతలు చెలరేగడం సరికాదని పేర్కొంది.
రెండు దేశాల ప్రజలను తాము ప్రేమిస్తున్నామని, వారి మధ్య శాంతియుత పరిస్థితులు నెలకొనడానికి సాధ్యమైన చర్యలను తీసుకోవడానికి వెనుకాడబోమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసం వైట్‌హౌస్ ప్రెస్ కార్యదర్శి కెయిలీ మెక్ఎనానీ స్పష్టం చేశారు. వైట్‌హౌస్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్-చైనా మధ్య సఖ్యత నెలకొనాల్సిన అవసరం ఉందని డొనాల్డ్ ట్రంప్ అభిప్రాయపడుతున్నారని అన్నారు.

ఈ రెండు దేశాల మధ్య యుద్ధపూరక వాతావరణాన్ని నివారించడానికి ఎలాంటి చర్యలనైనా తీసుకోవడానికి వెనుకాడబోమని చెప్పారు. ఆసియాలో బలమైన దేశాలుగా గుర్తింపు పొందిన భారత్-చైనా మధ్య యుద్ధ వాతావరణం నెలకొనడం సరికాదని, దీన్ని నివారించడానికి తాము మధ్యవర్తిత్వాన్ని వహిస్తామనీ స్పష్టం చేశారు. భారత్‌తో సన్నిహిత సంబంధాలను కొనసాగించడానికి తాము ముందుంటామని వైట్‌హౌస్ ఆర్థిక సలహదారు ల్యారీ కుడ్లోవ్ వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజే డొనాల్డ్ ట్రంప్ అభిప్రాయమేంటనేది ప్రెస్ కార్యదర్శి స్పష్టం చేశారు.
టిక్‌టాక్ సహా చైనా రూపొందించిన యాప్స్‌ను నిషేధించాలంటూ యూఎస్ కాంగ్రెస్ సభ్యులు లేఖ రాసిన రోజే డొనాల్డ్ ట్రంప్ తరఫున వైట్‌హౌస్ ప్రెస్ కార్యదర్శి తాజాగా ప్రకటన వెలువడటం ఆసక్తి రేపుతోంది. భారత్‌తో పాటు చైనాను కూడా ప్రేమిస్తున్నామంటూ డొనాల్డ్ ట్రంప్‌ను ఉటంకిస్తూ ప్రెస్ కార్యదర్శి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమౌతున్నాయి. యూఎస్ కాంగ్రెస్ సభ్యులు రాసిన లేఖపై ట్రంప్ తన వైఖరి ఏమిటనేది పరోక్షంగా స్పష్టం చేసినట్టయిందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.
భారత్ సహా ఏ దేశాన్ని కూడా వదులుకోవడానికి లేదా వివాదాలు, ఘర్షణ వాతావరణాన్ని కొని తెచ్చుకోవడానికి అమెరికా సిద్ధంగా లేదనే విషయాన్ని ట్రంప్ స్పష్టం చేసినట్టయింది. డేటా అభివృద్ధి రంగంలో భారత్‌తో కలిసి పనిచేస్తామంటూ అమెరికా ఇదివరకే వెల్లడించింది. 5జీ డేాటాను అభివృద్ధి చేయడంపై భారత సహకారాన్ని తీసుకుంటామని ఇటీవలే మైక్ పాంపియో వెల్లడించారు. భారత్‌తో తమ స్నేహ సంబంధాలను సుదీర్ఘకాలం పాటు కొనసాగించడానికి తాము ఆసక్తిగా ఉన్నామని స్పష్టం చేశారు.
-
ఇరాన్ క్లోజ్.. హార్మూజ్ ఓపెన్.. చైనా హ్యాపీ: ట్రంప్ సంచలన ప్రకటన -
మరో రెండు రోజుల్లో ఏదైనా జరగొచ్చు: ట్రంప్ కీలక ప్రకటన -
Trump Calls PM Modi: మోడీకి ట్రంప్ ఫోన్ కాల్-హార్ముజ్ పై కీలక చర్చలు..! -
మే ఐ కమిన్: యుద్ధంలోకి డ్రాగన్ ఎంట్రీ.. ఇప్పుడే అసలు మజా..?? -
H-1B Visa జారీ ఇకపై మరింత.. !! -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..!











Click it and Unblock the Notifications