వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సరిహద్దుల్లో ఉద్రిక్తతలున్నా 100 బిలియన్ డాలర్లు దాటిన భారత్, చైనా వాణిజ్యం

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

భారత్ చైనా సంబంధాల్లో ఒడిదొడుకులు ఉన్నప్పటికీ, రెండు దేశాల మధ్య వాణిజ్య రంగంలో సంబంధాలు ఎంత బలంగా ఉన్నాయనే విషయం వెలుగులోకి వచ్చింది.

ఈ ఏడాది భారత్, చైనా మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 100 బిలియన్ డాలర్ల (రూ. 7.50 లక్షల కోట్లు) భారీ గణాంకాలు నమోదు చేసింది.

కానీ, రెండు దేశాల మధ్య దీని గురించి పెద్దగా చర్చ జరగడం లేదు. తూర్పు లద్దాఖ్‌లో సైనిక ప్రతిష్టంభన తర్వాత రెండు దేశాల బంధాలు చాలా క్షీణించాయి.

పీటీఐ వివరాల ప్రకారం, 2001లో 1.83 బిలియన్ డాలర్ల నుంచి మొదలైన ఈ ద్వైపాక్షిక వాణిజ్యం 2021లో 11 నెలల్లోనే 100 బిలియన్ డాలర్లకు పెరిగింది. ఇరు దేశాల వాణిజ్య సంబంధాలను మెరుగుపరుచుకోవడంతో, ఇది రెండు దేశాల వాణిజ్యానికి ఒక పెద్ద అవకాశంగా నిలిచింది.

షీ జిన్ పింగ్, నరేంద్ర మోదీ

వాణిజ్యం ఎంత పెరిగింది?

చైనా జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ కస్టమ్స్(జీఏసీ) గత నెల గణాంకాల ప్రకారం భారత-చైనా ద్వైపాక్షిక వాణిజ్యం 114.263 బిలియన్ డాలర్లు అయ్యింది. అది 2021 జనవరి నుంచి నవంబర్ మధ్య 46.4 శాతం పెరిగింది.

భారత్ నుంచి చైనాకు ఎగుమతులు 26.358 బిలియన్ డాలర్లకు పెరిగాయి. ఇవి ఏటా 38.5 శాతం పెరుగుతున్నాయి. చైనా నుంచి భారత్‌ చేసుకునే దిగుమతులు 87.905 బిలియన్ డాలర్లకు చేరాయి. ఇది 49 శాతం వరకూ పెరిగింది.

మరోవైపు ఇరు దేశాల ద్వైపాక్షిక వాణిజ్యం 100 బిలియన్ డాలర్ల గణాంకాలను దాటితే, అదే 11 నెలల సమయంలో భారత వాణిజ్య లోటు కూడా వేగంగా పెరిగింది.

చైనాకు విక్రయించిన దానికంటే భారత్ ఆ దేశం నుంచి ఎక్కువ సామగ్రిని కొనుగోలు చేయడంతో వాణిజ్య లోటు పెరిగింది.

వాణిజ్య లోటు భారత్‌కు చాలా ఆందోళన కలిగించే విషయం. అది ఇప్పుడు 61.547 బిలియన్ డాలర్లకు చేరింది. అది ఈ ఏడాది 53.49 శాతం పెరిగింది.

వాణిజ్య లోటుపై భారత్‌కు ఆందోళనలు ఉన్నప్పటికీ, ద్వైపాక్షిక వాణిజ్యం రికార్డు గణాంకాలను నమోదు చేసింది. అయితే, తూర్పు లద్దాఖ్‌లో ప్రతిష్టంభన అలాగే కొనసాగుతుండడంతో దీనిపై సంబరాలూ చేసుకోవడం కుదరదు. లద్దాఖ్‌లో పరిస్థితుల వల్ల ఇరు దేశాల సంబంధాలు ఇంతకు ముందుకంటే ఎక్కువ క్షీణించాయి.

రికార్డు వాణిజ్యంపై ప్రశ్నలు, క్షీణించిన సంబంధాలు

రక్షణ విశ్లేషకులు బ్రహ్మ చెల్లాని ఇరు దేశాల వాణిజ్యం వృద్ధి చెందడంపై ప్రశ్నలు లేవనెత్తుతూ ఒక ట్వీట్ చేశారు.

https://twitter.com/Chellaney/status/1474687670303428608

"చైనా సరిహద్దు ఆక్రమణల నేపథ్యంలో 2021లో చైనాతో వాణిజ్యంలో 50 శాతం వృద్ధిని మోదీ ప్రభుత్వం ఎలా సమర్థించుకుంటుంది. ఇందులో జనవరి, నవంబర్ మధ్య 61.5 బిలియన్ డాలర్ల మిగులు చైనాకు అనుకూలంగా ఉంది. అది ప్రస్తుత ఆర్థికసంవత్సరంలో భారత్‌ మొత్తం రక్షణ వ్యయానికి దాదాపు సమానం" అన్నారు.

2020 మే 5న భారత్, చైనా మధ్య సైనిక ప్రతిష్టంభన మొదలైంది. ఆ తర్వాత పాంగాంగ్ లేక్ ప్రాంతంలో ఇరు దేశాల సైన్యం మధ్య హింసాత్మక ఘర్షణలు చోటుచేసుకున్నాయి. రెండు దేశాలకు చెందిన సైనికులు చనిపోయారు. మెల్లమెల్లగా రెండు దేశాలూ తమ ప్రాంతాల్లో కొన్ని వేల మంది సైనికులను, భారీ ఆయుధాలను మోహరించాయి.

సైన్యం, దౌత్యవేత్తలు చాలాసార్లు చర్చలు జరిపిన తర్వాత రెండు పక్షాలూ ఈ ఏడాది ఫిబ్రవరిలో పాంగాంగ్ లేక్ ఉత్తర, దక్షిణం నుంచి ఆగస్టులో గోగ్రా ఏరియా నుంచి వెనక్కు వెళ్లడం ప్రారంభించాయి.

జులై 31న రెండు సైన్యాల మధ్య 12వ రౌండ్ చర్చలు జరిగాయి. కొన్ని రోజుల తర్వాత గోగ్రాలో ఇరు దేశాల సైన్యం తమ డిసెంగేజ్‌మెంట్ ప్రక్రియ పూర్తి చేసింది. ఆ ప్రాంతంలో శాంతి, సంయమనం పునరుద్ధరణ దిశగా దీనిని చాలా ముఖ్యమైనదిగా భావించారు.

పర్వత ప్రాంతాల్లో వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) దగ్గర సరిహద్దుల్లో రెండు పక్షాలూ 50 నుంచి 60 వేల మంది సైనికులను మోహరించాయి.

ఈ ఘర్షణ స్థితిలో డబ్ల్యుఎంసీసీ(వర్కింగ్ మెకానిజం ఫర్ కన్సల్టేషన్ అండ్ కోఆర్డినేషన్) ఒక ఆశా కిరణంలా నిలిచింది. దీని ప్రకారం ఇరు దేశాల విదేశాంగ మంత్రులు, టాప్ సైనిక కమాండర్లు చర్చలు జరిపి ఉద్రిక్తతలను నియంత్రించారు.

లద్దాఖ్ ప్రతిష్టంభన కేవలం వాణిజ్యం మినహా మిగతా అన్ని సంబంధాలనూ స్తంభింపజేసింది.

సరిహద్దుల్లో ఉద్రిక్తతలు

రెండు దేశాల అభిప్రాయం

బీజింగ్ ఎన్నో చర్యల ద్వారా ఒప్పందాలను ఉల్లంఘించడం వల్ల, భారత్, చైనా సంబంధాలు ప్రస్తుతం అత్యంత ఘోరమైన స్థితిలో ఉన్నాయని ఈ ఏడాది నవంబర్‌లో సింగపూర్‌లో జరిగిన పానల్ డిస్కషన్‌లో భారత విదేశాంగ మంత్రి ఎస్.జయశంకర్ అన్నారు. దానికి వారి దగ్గర ఇప్పటికీ నిర్దిష్ట సమాధానాలు లేవన్నారు.

లద్దాఖ్ సరిహద్దు ప్రతిష్టంభన సందర్భం గురించి చెప్పిన ఆయన "మేం మా సంబంధాల్లో ముఖ్యంగా ఒక దారుణమైన సమయంలో ఉన్నాం. ఒప్పందాలను ఉల్లంఘించేలా చైనా ఎన్నో చర్యలకు పాల్పడింది. వారి దగ్గర ఇప్పటికీ నిర్దిష్ట సమాధానాలు లేవు. ఇరు దేశాల సంబంధాలను ఎక్కడికి తీసుకెళ్లాలనుకుంటున్నారు అనే విషయంలో వారు కాస్త ఆలోచించాల్సిన అవసరం ఉంది. కానీ, ఆ సమాధానం వారే ఇవ్వాలి" అన్నారు.

చైనాలో భారత మాజీ రాయబారి విక్రమ్ మిస్త్రీ కూడా డిసెంబర్ 6న జరిగిన తన వర్చువల్ వీడ్కోలు కార్యక్రమంలో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ ముందు ఇదే అంశాన్ని లేవనెత్తారు.

"మన సంబంధాల్లో అవకాశాలు, సవాళ్లు ఉన్నాయి. గత ఏడాది కొన్ని సవాళ్లు ఎదురయ్యాయి. అవి ఇరు దేశాల సంబంధాల్లో మనకున్న అవకాశాలను తమ నియంత్రణలోకి తీసుకునేశాయి" అని వాంగ్ దగ్గర లద్దాఖ్ ప్రతిష్టంభనను ప్రస్తావిస్తూ మిస్త్రీ అన్నారు.

మిస్త్రీ 2019 జనవరిలో భారత రాయబారిగా పదవి స్వీకరించారు. దౌత్య ప్రయత్నాల ద్వారా రెండు దేశాలు 2017 డోక్లామ్ ప్రతిష్టంభన నుంచి బయటపడినప్పుడు ఆయన ఈ బాధ్యతలు లభించాయి.

2018లో వుహాన్‌లో, 2019లో చెన్నైలో ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ మధ్య మొదటి, రెండో అధికారిక శిఖరాగ్ర సదస్సులో సుదీర్ఘ అభివృద్ధి ఎజెండాపై చర్చలతో ఈ ప్రతిష్టంభనకు తెరపడింది. అయితే తర్వాత తూర్పు లద్దాఖ్‌లో ప్రతిష్టంభన మొదలైంది.

చైనా నుంచి న్యూ దిల్లీ తిరిగిరావడానికి ముందు మిస్త్రీ మీడియాతో అనధికారిక సంభాషణ జరిపారు. చెన్నై శిఖరాగ్ర సదస్సు సమయంలో రెండు ముఖ్యమైన కార్యక్రమాలు, వాటిని అమలుకు చొరవ చూపడానికి మోదీ, జిన్ పింగ్ ఎలా అంగీకరించారో గుర్తు చేసుకున్నారు.

చైనా ఉప ప్రధాని, భారత విదేశాంగ మంత్రి అధ్యక్షతన హై లెవల్ ఎకనామిక్ అండ్ ట్రేడ్ డైలింగ్(HETD) యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని రెండు దేశాలు నిర్ణయించాయి. ఇది ద్వైపాక్షిక వాణిజ్యం, వాణిజ్య భాగస్వామ్యం సహా భారత వాణిజ్య లోటు అంశాలను కూడా చూస్తుంది.

ఇలాంటి ఉన్నత స్థాయి యంత్రాంగాన్ని చైనా కేవలం అమెరికాతో సంబంధాలు మెరుగుపరుచుకోవడం కోసమే ఏర్పాటు చేసింది.

దీనితోపాటూ ఇరు దేశాల నేతలు 2020ని ఇండియా-చైనా కల్చరల్ పీపుల్ టు పీపుల్ ఎక్ఛేంజ్ ఏడాదిగా ప్రకటించాలని నిర్ణయించారు. దీని ప్రకారం రెడు దేశాల మధ్య వివిధ స్థాయిల్లో 70 కార్యక్రమాలు నిర్వహించాలి. వీటిలో ఇరు దేశాల చట్టసభలు, రాజకీయ పార్టీలు, సాంస్కృతిక, యువజన సంస్థలు, సైన్యాల గురించి పరస్పరం అవగాహన పెంచుకోవడం కూడా ఉన్నాయి.

దురదృష్టవశాత్తూ తూర్పు లద్దాఖ్ ప్రతిష్టంభన తర్వాత ఆ ప్రభావం రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై పడింది. దాంతో ఈ రెండు కార్యక్రమాలూ విఫలమయ్యాయి.

ఇరు దేశాల సంబంధాల గురించి చైనా ఎలా అనుకుంటోందో మిస్త్రీతో జరిగిన సమావేశం సమయంలో వాంగ్ చెప్పారు.

"మధ్యలో పెద్ద అడ్డంకి లాంటిది ఏదీ లేకపోయినా, పరస్పర సంబంధాలు మెరుగు పరచుకోకుండా ఇరు పక్షాలను ఏకతాటిపైకి తీసుకురావడం చాలా కష్టం. చైనా, భారత్ పరస్పరం భాగస్వాములుగా, స్నేహితులుగా మారాల్సి ఉంటుంది. ఒకరికొకరు ముప్పుగా కాదు" అని వాంగ్ అన్నారు.

భారత్-చైనా సంబంధాలను పునరుద్ధరించడానికి, ఒక కొత్త మోడల్, వ్యూహాత్మక ఫ్రేమ్‌వర్క్ రూపొందించడానికి డోక్లాం, లద్దాఖ్ ప్రతిష్టంభన అనేది ఒక హెచ్చరిక లాంటిదని పరిశీలకులు భావిస్తున్నారు.

దేశీయ స్థాయిలో చైనా అధికార కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా(సీపీసీ) నవంబర్‌లో ఒక హై ప్రొఫైల్ సమావేశం నిర్వహించింది. అందులో గత వందేళ్లలో పార్టీ సాధించిన భారీ విజయాలపై ఒక చారిత్రక తీర్మానం ఆమోదించారు. అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ను రికార్డు స్థాయిలో మూడోసారి అధ్యక్ష పదవి చేపట్టడానికి ఇందులో మార్గం కూడా సుగమం చేశారు.

పార్టీ 100 ఏళ్ల చరిత్రలో ఇది ఒక విధంగా మూడో చారిత్రక తీర్మానం. ఇంతకు ముందు తీర్మానాలు ఆ పార్టీ వ్యవస్థాపకుడు మావో జెడాంగ్, ఆయన వారసుడు డెంగ్ సియోపింగ్ నాయకత్వంలో జారీ అయ్యాయి.. సీపీసీ 19వ కేంద్రీయ కమిటీ ఆరో ప్లీనరీ సమావేశంలో ఈ తీర్మానాన్ని సమీక్షించి, ఆమోదించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
India-China trade crosses $ 100 billion despite border tensions
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X