అంతర్జాతీయ కోర్టుకు భారత్ బిగ్ షాక్- సింధు జలాలపై తాజాగా ఇదే..!
భారత్ లో పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ తో దశాబ్దాలుగా ఉన్న సింధు జలాల ఒప్పందాన్ని కేంద్రం నిలిపివేసింది. అయితే దీన్ని పునరుద్ధరించకపోతే తమ దేశంలో రైతులు తీవ్రంగా ఇబ్బందిపడతారని, జనానికి తాగునీరు దొరకదని పాకిస్తాన్ వేడుకుంది. అయితే భారత్ (india) స్పందించకపోవడంతో అంతర్జాతీయ కోర్టును ఆశ్రయించింది. దీంతో ఈ వ్యవహారంపై విచారణ జరిపిన అంతర్జాతీయ కోర్టు పాకిస్తాన్ కు సింధు జలాల్ని విడుదల చేయాలని భారత్ ను ఆదేశించింది. దీన్ని భారత్ తోసిపుచ్చింది.
అంతర్డాతీయ కోర్టుకు భారత్ షాక్ (india)
అసలు అంతర్జాతీయ కోర్టు పరిధినే తాము గుర్తించడం లేదని, సింధు జలాల విషయంలో పాకిస్తాన్ వేసిన పిటిషన్ పై విచారణకు సైతం హాజరు కాబోమని తేల్చిచెప్పేసింది. అయితే తాజాగా మరోసారి ఇదే అంశంపై అంతర్జాతీయ కోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణ సింధు జలాల ఒప్పంద చట్రం కింద కొత్త విచారణలు, డాక్యుమెంట్ ఆదేశాలతో ముందుకు సాగుతున్నప్పటికీ, ఈ చర్యల చట్టబద్ధతను తాము గుర్తించడం లేదని, ఇందులో పాల్గొనబోమని భారతదేశం స్పష్టం చేసింది.

చట్టబద్ధతను గుర్తించని భారత్
వాస్తవానికి సింధు జలాల ఒప్పందం కింద ఏర్పాటు చేసిన మధ్యవర్తిత్వ కోర్టు గతవారం జారీ చేసిన ఉత్తర్వులు వివాదాస్పదం అయ్యాయి. ఇది భారత జలవిద్యుత్ ప్లాంట్ల నుండి రెండో దశ కింద నీటిని విడుదల చేయాలని ఆదేశించింది. అలాగే ఇవాళ, రేపు హేగ్‌లోని పీస్ ప్యాలెస్‌లో విచారణల్ని ఖరారు చేసింది. అలాగే భారత్ తో సంబంధం లేకుండా పాకిస్తాన్ ను హాజరు కావాలని ఆదేశించింది. అలాగే భారత్ తమ వాదనలు సమర్పించలేదని కూడా పేర్కొంది. దీనిపై స్పందించిన భారత్... సింధు జలాల ఒప్పందంపై చట్ట విరుద్దంగా ఏర్పాటు చేసిన మధ్యవర్తిత్వ కోర్టు చట్టబద్ధతను తాము గుర్తించినందున, దానికి ఎలాంటి సమాచారం ఇచ్చేది లేదని తేల్చేసింది.

భారత్ లేకుండా అసాధ్యం
మరోవైపు గతంలో కుదిరిన సింధు జలాల ఒప్పందం ప్రకారం ఏవైనా వివాదాలు తలెత్తితే దాన్ని ప్రపంచ బ్యాంక్ కు చెందిన తటస్థ నిపుణుడికి నివేదించాలి. అయితే చట్టపరమైన వివాదాలు మాత్రం మధ్యవర్తిత్వ న్యాయస్థానానికి వెళ్తాయి. ప్రస్తుత సమస్యలు తటస్థ నిపుణుల పరిధిలోకి వస్తాయని, కోర్టును ఇందులోకి లాగాలని పాకిస్తాన్ చేస్తున్న ప్రయత్నాలు ఫోరమ్ షాపింగ్ కిందకు వస్తాయని భారత్ వాదిస్తోంది. అయినా భారత్ లేకుండా ఈ విచారణ ముందుకెళ్లే పరిస్ధితి మాత్రం కనిపించడం లేదు.
-
జీరా వాటర్ Vs మెంతుల నీరు- షుగర్ కంట్రోల్ చేయడానికి ఏది బెస్ట్..!! -
పాకిస్థాన్ లో చిక్కుకున్న IAF పైలట్..? భారత్ సంచలన ఆపరేషన్..! -
బిగ్ షాక్: దేశవ్యాప్తంగా ప్రతిరోజూ సాయంత్రం 2 గంటలు కరెంట్ కట్..! -
HIV : 300కు పైగా చిన్నారులకు హెచ్ఐవి - డాక్టర్ నిర్లక్ష్యమే కారణం..!! -
ఒక్క దెబ్బతో దివాలా తీసిన పాకిస్థాన్.. చరిత్రలో తొలిసారి ఆ పని చేసేందుకూ రెడీ.. -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000












Click it and Unblock the Notifications