భారత్‌లో బుద్దుడు నడయాడిన దేశం... శాంతిని కోరుకుంటుంది... యుద్దాన్ని కాదు... ఐరాసలో మోడీ
ఐక్యరాజ్యసమితిలో ప్రసంగించిన ప్రధాని నరేంద్రమోడీ మరోసారి శాంతి సందేశాన్ని వినిపించారు. భారత దేశం ఎల్లప్పుడు శాంతిని కోరుకుంటుందని చెప్పిన ఆయన ప్రపంచ దేశాలకు శాంతిని అందించడమే లక్ష్యంగా ముందుకుసాగుతుందని చెప్పారు. ముఖ్యంగా భారత దేశం బుద్దులు నడయాడిన దేశంగా ఆయన అభివర్ణించారు. ఈ నేపథ్యంలోనే భారతీయులు యుద్దాన్ని కోరుకోరని చెప్పిన ఆయన ప్రపంచానికి శాంతి సందేశాన్ని పంపిణ చరిత్ర భారత్‌కు ఉందని వ్యాఖ్యానించారు.
ఈనేపథ్యంలోనే ఐక్యరాజ్యసమితి ప్రపంచవ్యాప్తంగా శాంతి పరిరక్షణ కోసం తీసుకుంటున్న కృషిని మోడీ కొనియాడారు. ఇక ఉగ్రవాదం పోరుకు ప్రపంచదేశాలు కలిసిరావాలని ప్రధాని నరేంద్రమోడీ పిలుపునిచ్చారు. ప్రస్తుత తరుణంలో ఉగ్రవాదం రూపురేఖలు మారుతున్నాయని ఆయన చెప్పారు. శాంతిస్థాపనే లక్ష్యంగా ప్రపంచ దేశాలు ముందుకు కదలాల్సిన అవసరముందని ఆయన నొక్కి చెప్పారు. ప్రపంచలో ఉన్న సమస్యలు పరిష్కరింపబడాలంటే శాంతి మంత్రం ఒక్కటే మార్గమని ఆయన చెప్పారు.

మరోవైపు భారత దేశంలో తీసుకువస్తున్న పలు సంస్కరణలపై ఆయన ప్రస్తావించారు. ముఖ్యంగా గాంధీ ఆశయాల అమలుతో పాటు ఇటివల దేశ ప్రజలు ఇచ్చిన తీర్పును కూడ ఆయన ప్రస్థావించారు. భారత ప్రజలు తమ ప్రభుత్వానికి అతిపెద్ద మ్యాండేట్ ఇచ్చారని చెప్పారు. మరోవైపు స్వచ్చభారత్, లాంటీ పథకాల అమలు తీరుపై ఆయన పేర్కోన్నారు.












Click it and Unblock the Notifications