పాకిస్థాన్ కు గుడ్ న్యూస్ చెప్పిన భారత్.. వారికి ప్రత్యేకమైన మినహాయింపు

భారత్- పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకున్న సంగతి తెలిసిందే. ఇరు దేశాల మధ్య ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంతలా పరిస్థితులు ఉన్నాయి. గతేడాది ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్ అనంత్ నాగ్ జిల్లాలోని పహల్గామ్ లోయలో ఉగ్రమూకలు జరిపిన మారణహోమంలో 26 మంది అమాయక టూరిస్టులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ ఈ దారుణానికి పాల్పడినట్లు తేలిన నేపథ్యంలో ఆ దేశంపై భారత్ సైన్యం ఆపరేషన్ సింధూర్ చేపట్టింది.

మే 7 నుంచి 10 వరకు జరిగిన ఆపరేషన్ సింధూర్ లో పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని 9 కీలక ఉగ్ర స్థావరాలను భారత్ ధ్వంసం చేసింది. అలాగే వందలాది మంది టెర్రరిస్టులను హతమార్చింది. దాంతో పాటు పాకిస్థాన్ పై అనేక ఆంక్షలు విధించింది. సింధూ నది జలాల పంపిణీ నిలిపివేత, అటారీ- వాఘా బోర్డర్ మూసివేత, ఇరు దేశాల గగనతలంపై నిషేధం విధింపు తదితర చర్యలను చేపట్టింది.

అయితే తాజాగా పాకిస్థాన్ కు ఊరట కలిగించేలా భారత్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం అవుతోంది. భారత్ లో నివాసం ఉంటున్న విదేశీయులకు సంబంధించిన వీసా, పాస్ పోర్ట్ నిబంధనల్లో పలు మార్పులు చేపట్టినట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్(ఎగ్జెమ్షన్)(అమెండ్మెంట్) ఆర్డర్, 2026 ప్రకారం ఈ మార్పులు చేసింది. ఈ మేరకు పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ నుంచి వచ్చిన శరణార్థులకు భారీ ఊరట లభించింది. పాకిస్థానీ ప్రజలు ఎవరైతే 2009 డిసెంబర్ 31 కంటే ముందు భారత్ కు వచ్చి స్థిరపడ్డారో వారికి పాస్ పోర్ట్ రెన్యూవల్ నుంచి మినహాయింపు లభించింది.

India introduces passport and visa rules special exemptions granted to those arriving from Pakistan

పాకిస్థాన్ లో కంప్యూటరైజ్డ్ నేషనల్ ఐడెంటిటీ కార్డ్ లేకపోవడం కారణంగా పాస్ పోర్ట్ ను రెన్యూవల్ చేసుకోలేని పరిస్థితి ఉండాలి. అలాగే పాకిస్థాన్ లో వివాహం చేసుకుని ఉండకూడదు.. దాంతోపాటు ఆ దేశంలో స్థిరాస్తుల్ని సంపాదించి ఉండకూడదని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. అలాగే ఇక ఫ్యూచర్ లో పాకిస్థాన్ వెళ్లబోమని అంగీకరించిన వారికి ఈ ప్రత్యేకమైన మినహాయింపులు వర్తిస్తాయని స్పష్టం చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+