హిట్ అన్నారు కదరా.. తీరా చూస్తే డబుల్ డిజాస్టరా..? ఇదేం ట్విస్ట్..
విక్టరీ వెంకటేశ్- మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన 'ఆదర్శ కుటుంబం' మూవీకి క్రమంగా కలెక్షన్స్ తగ్గుముఖం పట్టాయి. అక్టోబర్ 30 న విడుదలైన ఈ మూవీకి ఫస్ట్ డే నుంచే మిక్స్ డ్ టాక్ వచ్చిన సంగతి తెలిసిందే. మొదటి వీకెండ్ లో డీసెంట్ గానే వసూళ్లు రాబట్టినప్పటికీ ఆ తర్వాత క్రమంగా కలెక్షన్స్ లో డ్రాప్ కనిపించింది. వీకెండ్ అనంతరం నాలుగో రోజున తెలుగు రాష్ట్రాల నుంచి ఈ మూవీకి రూ. 2 కోట్ల షేర్ వచ్చింది. అయితే ఐదో రోజున కేవలం రూ. 1.36 కోట్ల షేర్ మాత్రమే దక్కించుకుంది. ఇక ఓవరాల్ గా చూస్తే ఈ మూవీకి మొదటి ఐదు రోజులు కలిపి రూ. 22 కోట్ల షేర్ వచ్చింది. అలాగే వరల్డ్ వైడ్ గా రూ. 32 కోట్ల 27 లక్షల షేర్ ను దక్కించుకుంది. అలాగే రూ. 61 కోట్ల గ్రాస్ వసూళ్లను కైవసం చేసుకుంది.
అయితే ఆదర్శ కుటుంబం మూవీ బ్రేక్ ఈవెన్ మార్క్ ను అందుకోవాలంటే మరో రూ. 32 కోట్ల షేర్ వసూల్లు రాబట్టాల్సిన అవసరం ఉంది. మరోవైపు ఇవాళ రిలీజ్ అయిన రామాయణ మూవీ బ్లాక్ బస్టర్ టాక్ తో నడుస్తోంది. మరోవైపు నవంబర్ 6న కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన సీన్ మూవీ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావడం కష్టమేనని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఓవర్సీస్ లో ఈ మూవీ డబుల్ డిజాస్టర్ అని టాక్ వినిపిస్తోంది. ఇక త్రివిక్రమ్- వెంకటేష్ కాంబోలో గతంలో నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి చిత్రాల తర్వాత వస్తున్న మూవీ కావడంతో సినిమాపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి.

ఇక ఆదర్శ కుటుంబం మూవీలో వెంకటేశ్ సరసన హీరోయిన్ గా శ్రీనిధి శెట్టి నటించింది. అలాగే నారా రోహిత్, నివేతా పేతురాజ్, సత్య, రావు రమేష్, బ్రహ్మాజీ, యువీనా, రాజా ప్రజ్వల్ వంటి వారు కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీని హారికా అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్ రాధాకృష్ణ(చినబాబు) నిర్మించారు. త్రివిక్రమ్ మార్క్ కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్, యాక్షన్ మేళవింపుగా తెరకెక్కిన ఈ మూవీ గత నెల 30 న విడుదలైన సంగతి తెలిసిందే.












Click it and Unblock the Notifications
