భారత్ దేనికైనా సిద్ధం!, గతంలోను హెచ్చరించాం: చైనాకు సుష్మా స్వరాజ్ ధీటుగా..
చైనాను మనం బెదిరిస్తున్నామన్నది పూర్తి అవాస్తవమని కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్ అన్నారు. భారత్ - చైనా మధ్య గల సరిహద్దులను ఆ దేశం మార్చడం కుదరదని చెప్పారు.
న్యూఢిల్లీ: చైనాను మనం బెదిరిస్తున్నామన్నది పూర్తి అవాస్తవమని కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్ అన్నారు. భారత్ - చైనా మధ్య గల సరిహద్దులను ఆ దేశం మార్చడం కుదరదని చెప్పారు.

ప్రతి భారతీయుడి సమర్థన
ప్రస్తుతం చైనా - భారత్ మధ్య ఉన్న పరిస్థితిపై ప్రభుత్వ వాదనను ప్రతి భారతీయుడు సమర్థిస్తున్నాడని చెప్పారు. ఆమె రాజ్యసభలో గురువారం చైనా - భారత్ సరిహద్దు ఉద్రిక్తతపై స్పందించారు.

చైనా మార్చేసే ప్రయత్నాలు
డొక్లాం జంక్షన్‌లో ప్రస్తుత పరిస్థితిని చైనా మార్చేసే ప్రయత్నాలు చేస్తోందని మండిపడ్డారు. చైనా ఏళ్లుగా ఇక్కడికి దగ్గరగా వచ్చే ప్రయత్నాలు చేస్తోందన్నారు.
Recommended Video


భారత్ సిద్ధం
చైనా బుల్డోజర్స్, నిర్మాణ పరికరాలు తీసుకొని డొక్లాం జంక్షన్‌కు వచ్చిందని, అది మన భద్రతకు ముప్పు అని సుష్మా స్వరాజ్ స్పష్టం చేశారు. తమను తాము రక్షించుకునేందుకు భారత్ ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధమన్నారు.

రోడ్డుపై హెచ్చరించాం..
సిక్కిం వివాదంలో భారత్ ఎలాంటి అసంబద్ధ విషయాలు చెప్పట్లేదని, ఈ విషయంలో ప్రపంచ దేశాలు భారత్‌కు మద్దతుగా ఉన్నాయని సుష్మా చెప్పారు. సరిహద్దు వివాదం చైనా, భూటాన్ మధ్యే ఉన్నంతవరకు భారత్ ఎలాంటి చర్యలు చేపట్టదన్నారు. కానీ.. ఎప్పుడైతే అది భారత్-టిబెట్-భూటాన్ జంక్షన్ వరకు వస్తుందో అది మన దేశ భద్రతపై ప్రభావం చూపుతుందని సుష్మా స్వరాజ్ స్పష్టం చేశారు. రోడ్డు నిర్మాణంపై ఇప్పటికే పలుమార్లు చైనాను హెచ్చరించినట్లు తెలిపారు.

సుష్మా ఆగ్రహం
సరిహద్దు వివాదం విషయంలో భారత్ ప్రవర్తిస్తున్న తీరుపై ప్రపంచ దేశాలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయంటూ చైనా చేసిన ఆరోపణలపై సుష్మా స్వరాజ్ మండిపడ్డారు.












Click it and Unblock the Notifications