వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రయాన్-1 జాడ తెలిసింది.. చంద్రుడి చుట్టే తిరుగుతోంది.. గుర్తించిన నాసా రాడార్

ఇప్రో తొలి లూనార్ మిషన్ చంద్రయాన్-1 ఇప్పటికీ చంద్రుడి చుట్టూ తిరుగుతూనే ఉందని నాసా ఇంటర్ ప్లానెటరీ రాడార్ గుర్తించింది

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

హ్యూస్టన్: ఇప్రో తొలి లూనార్ మిషన్ చంద్రయాన్-1 జాడ తెలిసింది. అది ఇప్పటికీ చంద్రుడి చుట్టూ తిరుగుతూనే ఉందని నాసా ఇంటర్ ప్లానెటరీ రాడార్ గుర్తించింది. ప్రయోగించి ఏడాది కూడా కాకుండానే దీనితో ఇస్రోకు కమ్యూనికేషన్ తెగిపోయిన విషయం విదితమే.

22 అక్టోబర్ 2018న చంద్రయాన్-1 ను చంద్రుని కక్ష్యలోకి ప్రయోగించారు. 29 ఆగస్టు 2009న దీంతో ఇస్రోకు సమాచార సంబంధం తెగిపోయింది. ఆ తరువాత చంద్రయాన్-1 ఏమైందో ఎవరికీ తెలియదు. బహుశా చంద్రుడి ఉపరితలానికి ఢీకొని ఉంటుందని.. అందుకే సమాచార సంబంధాలు తెగిపోయాయని అందరూ అనుకున్నారు.

నిక్షేపంలా తిరుగుతోంది...

నిక్షేపంలా తిరుగుతోంది...

అయితే అది నిక్షేపంలా చంద్రుడి చుట్టూ తిరుగుతూనే ఉంది. ప్రస్తుతం చంద్రుడి ఉపరితలానికి 200 కిలోమీటర్ల ఎత్తులో తిరుగుతోందని తాజాగా నాసా శాస్త్రవేత్తలు వెల్లడించారు.

ఎల్ఆర్ఓ కూడా...

ఎల్ఆర్ఓ కూడా...

చంద్రయాన్-1 తోపాటుగా నాసాకు చెందిన లూనార్ రికనాయిసెన్స్ ఆర్బిటార్ ను కూడా ఈ రాడార్ గుర్తించినట్లు నాసాకు చెందిన జెట్ ప్రొపల్షన్ లేబొరేటరీ రాడార్ సైంటిస్ట్ మరీనా బ్రోజోవిక్ వెల్లడించారు.

ఏడేళ్లుగా గాలింపు...

ఏడేళ్లుగా గాలింపు...

లూనార్ రికనాయిసెన్స్ ఆర్బిటార్ ను సులువుగానే గుర్తించగలిగినా.. ఎప్పుడో ఏడేళ్ల కిందట కమ్యూనికేషన్ తెగిపోయిన చంద్రయాన్-1ను గుర్తించడానికి మాత్రం కాస్త శ్రమించాల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నారు.

గుర్తించడం కష్టమే...

గుర్తించడం కష్టమే...

సాధారణంగా భూమి కక్ష్యలో సమాచార వ్యవస్థ తెగిపోయి తిరుగుతున్న స్పేస్ క్రాఫ్ట్, ఇతర శిథిలాలను గుర్తించడమే కష్టం. అలాంటిది చంద్రుడి కక్ష్యలో ఉన్న వాటిని గుర్తించడం ఇంకా కష్టం. చంద్రుని వెలుతురులో చిన్న చిన్న వస్తువులను ఆప్టికల్ టెలిస్కోపులు గుర్తించలేవు.

ఐపీఆర్ టెక్నాలజీతో...

ఐపీఆర్ టెక్నాలజీతో...

అయితే కొత్తగా వచ్చిన ఇంటర్ ప్లానెటరీ రాడార్ అనే వ్యవస్థ ద్వారా ఈ స్పేస్ క్రాఫ్ట్ లను గుర్తించడం సాధ్యపడింది. భవిష్యత్తులో చంద్రుడిపైకి స్పేస్ క్రాఫ్ట్ లను పంపేవారికి ఈ నూతన సాంకేతిక పరిజ్ఞానం ఎంతగానో ఉపయోగపడుతుందని ఖగోళ శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. మరో రకంగా చెప్పాలంటే.. ఈ కొత్త టెక్నాలజీని విజయవంతంగా పరీక్షించడానికి కూడా మన చంద్రయాన్-1 ఉపయోగపడిందన్న మాట.

English summary
India made history back in 2008 when ISRO launched the first unmanned lunar spacecraft, the Chandrayaan 1. When it was launched in October 2008, the mission was supposed to be operational for 2 years, but then it vanished. On August 29, 2009, the communication was abruptly lost. Now, after 8 years, US’ space agency NASA has found the Chandrayaan 1. According to NASA, the scientists used a ground radar to find the spacecraft. The Chandrayaan-1 has been located at NASA’s Jet Propulsion Laboratory (JPL) in Pasadena, California.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X