వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సరిహద్దుల్లో యుద్ధమేఘాలు .. ఎయిర్ పోర్టులను మూసివేస్తున్న భారత్, పాకిస్థాన్

|
Google Oneindia TeluguNews

ఇస్లామాబాద్ : పాకిస్థాన్ పై ఐఏఎఫ్ ఫైటర్లు చేసిన దాడితో సరిహద్దులో క్షణం క్షణం పరిస్థితి మారుతోంది. భారత్, పాకిస్థాన్ యుద్ధానికి సన్నద్ధమవుతున్నామనే సంకేతాలను ఇస్తున్నాయి. దీనికి ఇరుదేశాల ప్రధాన నగరాల్లో ఎయిర్ పోర్టుల మూసివేత బలం చేకూరుస్తోంది. కయ్యానికి కాలుదువ్వేందుకు పాకిస్థాన్ సిద్దమంటుండగా .. మేం రేడీ అని భారత్ తేల్చిచెప్పడంతో సరిహద్దుల్లో హైటెన్షన్ నెలకొంది.

దాడితో మారుతోన్న పరిస్థితి ..

దాడితో మారుతోన్న పరిస్థితి ..

ఉగ్ర మూకలను పెంచి పోషించే పాకిస్థాన్ .. సరిహద్దులో కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పోడుస్తూనే ఉంది. యురీ లాంటి దాడులు చేస్తూ కవ్వించింది. దానికి ధీటుగా భారత్ స్పందించి .. సర్జికల్ స్ట్రైక్స్ చేసింది. ఇటీవల పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై దాడితో .. భారత వాయుసేన జైషే మహ్మద్ శిక్షణ శిబిరాన్ని ధ్వంసం చేసింది. దీంతో ఎలాగైనా తిరిగి దాడి చేయాలని పాకిస్థాన్ భావిస్తోంది. అందులో భాగంగా ఇరుదేశాలు ఎయిర్ పోర్టులను మూసివేస్తున్నాయి.

యుద్ధ విమానాలకు ఓకే ..

యుద్ధ విమానాలకు ఓకే ..

సాధారణంగా గగనతలంలో యుద్ధ విమానాలు సంచరించాలంటే అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితితో పాకిస్థాన్ తమ గగనతరంలో యుద్ధవిమానాలు తిరిగేందుకు పర్మిషన్ ఇచ్చింది. అలాగే దేశంలోని ముఖ్య నగరాల ఎయిర్ పోర్టులను మూసివేసింది. ముల్తాన్, లాహోర్, ఫైసలాబాద్, సియాల్ కోట్ .. విమానాశ్రయాలను క్లోజ్ చేస్తున్నట్టు ప్రకటించింది. గగనతలంలో విమానాల రాకపోకలను నిలిపివేసి ... యుద్ధవిమానాలను రంగంలోకి దించేందుకు పాకిస్థాన్ సిద్ధమవుతోంది.

మేం రేడీ ..

మేం రేడీ ..

వాయుసేన దాడి తర్వాత పరిస్థితిని నిశీతంగా పరిశీలిస్తోన్న భారత్ .. యుద్ధానికి సిద్ధమనే తేల్చిచెబుతోంది. ఇప్పటికే సరిహద్దులో భారీ బలగాలను మొహరించింది. ఎప్పటికప్పుడు పరిస్థితిని ప్రధాని మోదీ సమీక్షిస్తున్నారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్, త్రివిద దళాల అధిపతులతో పరిస్థితిపై సమీక్షిస్తున్నారు. వాయుసేన దాడి తర్వాత పాకిస్థాన్ చేపట్టిన కవ్వింపు చర్యలను ధీటుగా తిప్పికొట్టాయి. మిరాజ్ విమానాల శక్తి, సామర్థ్యాల ముంద తట్టుకోలేక పాకిస్థాన్ విమానాలు తోకముడిచాయి.

భారత్ ఎయిర్ పోర్టుల మూసివేత

భారత్ ఎయిర్ పోర్టుల మూసివేత

యుద్ధానికి సిద్దమని పాకిస్థాన్ సంకేతాలు ఇవ్వడంతో మేం సిద్ధమని భారత్ తేల్చిచెప్పింది. ఇందులో భాగంగా భారత ప్రధాన ఎయిర్ పోర్టులను మూసివేస్తున్నట్టు తెలిపింది. సరిహద్దుతోపాటు ప్రధాన నగరాలైన ఢిల్లీ, చండీఘర్, అమృత్ సర్, ఢిల్లీ, చండీఘర్, డెహ్రడూన్ విమానాశ్రయాలను మూసివేసినట్టు ప్రకటించారు. జమ్ము, పఠాన్ కోట్ జాతీయ రహదారిని మూసివేశారు. ఈ రహదారిని ఆర్మీ అధికారుల తమ స్వాధీనంలోకి తీసుకున్నారు. పంజాబ్, కశ్మీర్ సరిహద్దుల్లో కూడా ఆర్మీ భారీగా బలగాలను మొహరించింది.

English summary
India has shown that we are ready to give Pakistan signal to war. It said that it is closing India's major airports. The main cities like Delhi, Chandigarh, Amritsar, Delhi, Chandigarh and Dehradun airports have been closed. Jammu, Pathankot National Highway is closed. This road was taken over by the Army officers. The army also heavily armed forces in the Punjab and Kashmir border.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X