Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఆ దేశంలో భారత్, పాక్ విద్యార్థులపై దాడులు-ముగ్గురు మృతి-ఎంబసీల అలర్ట్..!

విదేశాల్లో భారత ఉపఖండపు దేశాల్లో ఉన్న విద్యార్ధులకు నానాటికీ రక్షణ కరవవుతోంది. ఇప్పటికే అమెరికాతో పాటు పలు పాశ్చాత్య దేశాల్లో మన విద్యార్థులపై దాడులు పెరుగుతుండగా.. ఇప్పుడు కిర్గిజిస్తాన్ లోనూ భారతీయ విద్యార్ధులు టార్గెట్ అయ్యారు. స్థానికంగా ఉన్న ఓ హాస్టల్లో చెలరేగిన ఘర్షణ అంతకంతకూ పెద్దది కావడంతో స్థానికులు వర్సెస్ విదేశీయులుగా పరిస్ధితి మారిపోయింది. అనంతరం భారత్, పాకిస్తాన్ విద్యార్థులపై స్దానికులు తీవ్ర దాడులు చేస్తున్నారు.

కిర్గిజ్‌స్థాన్ రాజధాని బిష్కెక్‌లో రెండు రోజులుగా భారత్, బంగ్లాదేశ్, పాకిస్తాన్‌లకు చెందిన హాస్టళ్లను ఆగంతకులు టార్గెట్ చేసుకున్నారు. ఈ దాడుల్లో ముగ్గురు పాకిస్తానీ విద్యార్థులు మరణించినట్లు తెలుస్తోంది. దీంతో ఢిల్లీ, ఇస్లామాబాద్ లోని ఎంబసీలు కిర్గిజిస్తాన్ లో ఉన్న తమ విద్యార్ధులను అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నాయి. పాకిస్థానీలు, ఈజిప్షియన్లతో సహా స్థానికులు, విదేశీ విద్యార్థుల మధ్య హాస్టల్‌లో తలెత్తిన ఓ ఘర్షణ తర్వాత హింస చెలరేగిందని తెలుస్తోంది.

india Pakistan students staying in Kyrgyzstan hostels targeted here is reason

మే 13న జరిగిన ఈ ఘర్షణకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. హాస్టల్ లో జరిగిన గొడవ కాస్తా వీధులకు వ్యాపించడంతో స్థానికులు భారీ ఎత్తున రోడ్లపైకి వచ్చారు. గూండాయిజం ఆరోపణలతో స్థానిక పోలీసులు ముగ్గురు విదేశీ విద్యార్ధులను అదుపులోకి తీసుకున్నారు. భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ విద్యార్థులు ఉంటున్న మెడికల్ యూనివర్శిటీల హాస్టళ్లను స్దానికులు లక్ష్యంగా చేసుకోవడంతో ఉద్రికతలు కొనసాగుతున్నాయి. పరిస్ధితులు చక్కబడే వరకూ విద్యార్ధులు హాస్టళ్లలోనే ఉండాలని ఎంబసీలు కోరుతున్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+