తగ్గేదేలే..! నాటో వార్నింగ్ కు భారత్ స్ట్రాంగ్ కౌంటర్..!

అమెరికాతో పాటు పశ్చిమ దేశాల కూటమి నాటో (నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్) తాజాగా భారత్ తో పాటు చైనా, బ్రెజిల్ పై ఆంక్షలు తప్పవని హెచ్చరికలు చేసింది. ఉక్రెయిన్ తో పోరాడుతున్న రష్యా నుంచి చమురు కొంటూ ఆర్ధికంగా ఊతమిస్తున్న ఆయా దేశాలపై ఆంక్షలు విధిస్తామని నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రూటే వార్నింగ్ ఇచ్చారు. దీనిపై భారత్ ఇవాళ అంతే దీటుగా స్పందించి కౌంటర్ ఇచ్చింది.

రష్యాతో వాణిజ్యం చేస్తున్నామన్న కారణంతో ఆంక్షలు ఎదుర్కోక తప్పదన్న నాటో ఛీఫ్ వార్నింగ్ పై విదేశాంగశాఖ ఇవాళ ఘాటుగా స్పందించింది. విదేశాంగశాఖ తరపున అధికార ప్రతినిధి రణ్ ధీర్ జైశ్వాల్ నాటో ఛీఫ్ హెచ్చరికలపై స్పందిస్తూ ద్వంద్వ ప్రమాణాలు వీడాలని సూచించారు. తమ ప్రజల అవసరాల్ని దృష్టిలో ఉంచుకుని రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నట్లు ఆయన తేల్చిచెప్పేశారు. ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదన్నారు.

india reacted to nato s warning over trade with Russia says our people s needs is priority

అంతర్జాతీయ పరిణామాల్ని దృష్టిలో ఉంచుకుని తాము చమురు కొనుగోళ్లు జరుపుతున్నట్లు రణ్ ధీర్ జైశ్వాల్ నాటో అధిపతికి తెలిపారు. ఈ విషయంలో ద్వంద ప్రమాణాలు వద్దని ఆయనకు సూచించారు. తద్వారా రష్యా నుంచి చమురు కొనుగోళ్లు కొనసాగిస్తామని నాటోకు తేల్చిచెప్పేసినట్లయింది. రెండు రోజుల క్రితం అమెరికా కాంగ్రెస్ కు వెళ్లిన నాటో ఛీఫ్ అక్కడి సెనేటర్లతో కలిసి రష్యాకు మద్దతు ఇస్తున్న భారత్, చైనా, బ్రెజిల్ కు తమ బంధాలపై పునరాలోచించుకోవాలని కోరారు.

ఇప్పటికే రష్యాతో యుద్దంలో ఉక్రెయిన్ సుదీర్ఘకాలం పోరాడుతున్నా, తాము మద్దతిస్తున్నా విజయం సాధించలేకపోవడానికి కారణం భారత్, చైనా, బ్రెజిలే అని భావిస్తున్న ట్రంప్.. ఈ మూడు దేశాలపై భారీగా సుంకాలు విధిస్తామని హెచ్చరికలు జారీ చేశారు. అనంతరం నాటో ఛీఫ్ కూడా ఆంక్షలు విధిస్తామని హెచ్చరించారు. అయినా భారత్ మాత్రం రష్యా విషయంలో వెనక్కి తగ్గేది లేదని తేల్చిచెప్పేయడంతో నాటో, అమెరికా ఈ విషయంలో తదుపరి తీసుకోబోయే చర్యలపై ఉత్కంఠ నెలకొంది.

india reacted to nato s warning over trade with Russia says our people s needs is priority

వాస్తవానికి ఉక్రెయిన్ పై రష్యా దురాక్రమణ మొదలుపెట్టి రెండేళ్లవుతోంది. అయితే మధ్యలో ఉక్రెయిన్ కు మద్దతుగా అమెరికాతో పాటు ఇతర నాటో దేశాలు ఎంటరై సాయం చేయడం ప్రారంభించాయి. ఆయుధాలతో పాటు భారీ ఎత్తున క్షిపణులు, డ్రోన్లు, డబ్బు సాయం చేస్తుండటంతో ఉక్రెయిన్ ఇంకా రష్యాపై పోరు కొనసాగిస్తోంది. దీంతో తమ ఆర్ధిక వ్యవస్ధలు దెబ్బతింటున్నాయని నాటో దేేశాలు సైతం గగ్గోలు పెడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే భారత్ తో పాటు చైనా, బ్రెజిల్ కు అమెరికా, నాటో హెచ్చరికలు చేస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+