పాలస్తీనాపై స్వతంత్రంగానే : అమెరికా జెరూసలేం ప్రకటనపై భారత్
న్యూఢిల్లీ: జెరూసలేంను ఇజ్రాయెల్ రాజధానిగా అమెరికా ప్రకటించిన విషయంపై భారత్ స్పందించింది. పాలస్తీనా విషయంలో తాము స్వతంత్రంగా ఉండామని విదేశాంగ శాఖ ప్రకటన చేసింది.
పాలస్తీనా విషయంలో భారత నిర్ణయాలు స్వతంత్రంగా, స్థిరంగా ఉంటాయని, మన అభిప్రాయాలు, ఆసక్తులకు అనుగుణంగానే తీసుకుంటామని చెప్పింది.

మూడో దేశానికి ఇందులో జోక్యం లేదని చెప్పింది. కాగా, టెల్ అవివ్‌లో ఉన్న అమెరికా రాయబార కార్యాలయాన్ని జెరూసలేంకు తరలించాలని అమెరికా ఆదేశించిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications