ట్రంప్ కు మోడీ షాకులు..! జపాన్ తో చెక్ పెట్టేలా కీలక ప్రకటన.!
భారత్-అమెరికా బంధం బీటలు వారుతోంది. దశాబ్దాలుగా నమ్మకమైన మిత్రులుగా సాగిన ఇరుదేశాలూ ఇప్పుడు ట్రంప్ నిర్ణయాల కారణంగా దూరమయ్యే పరిస్ధితులు నెలకొంటున్నాయి. ముఖ్యంగా రష్యా చమురు కొంటున్నారనే కారణంతో భారత్ పై సుంకాల మోత మోగిస్తున్న ట్రంప్ అనివార్యంగా మన దేశ విదేశాంగవిధానాన్ని పునరాలోచించుకునేలా పురికొల్పుతున్నారు. ఈ నేపథ్యంలో మిగిలిన అగ్రరాజ్యాలకు చేరువయ్యేందుకు ప్రధాని మోడీ ప్రయత్నిస్తున్నారు.
ఇందులో భాగంగా జపాన్ టూర్ కు బయలుదేరిన ప్రధాని మోడీ మార్గమధ్యలో ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో ఆయన జపాన్ తో రక్షణ బంధాన్ని బలోపేతం చేసుకోబోతున్నట్లు కీలక ప్రకటన చేశారు. తన పర్యటన సందర్భంగా జపాన్-భారత్ భద్రతా సహకారంపై ఉమ్మడి ప్రకటన చేయబోతున్నట్లు తెలిపారు. రాబోయే తరాలకు సురక్షితమైన , స్థిరమైన ఇండో-పసిఫిక్‌ను రూపొందించాలనే ఆశయాన్ని ముందుకు తీసుకువెళ్లేలా ఇది ఉంటుందన్నారు.

భారత్-జపాన్ మధ్య ఉమ్మడి ప్రకటనపై సవరించిన ముసాయిదా మొదట 2008లో సంతకం చేసామని, ఆర్థిక భద్రత , రక్షణ పరిశ్రమలో సహకారం వంటి కొత్త రంగాలు ఇందులో ఉన్నాయన్నారు. జపాన్ ప్రధాన మంత్రి షిగేరు ఇషిబా , మోడీ మధ్య ఇవాళ సవరించిన ఒప్పందంపై సంతకాలు చేయబోతున్నారు. మోడీ ప్రభుత్వం తన రక్షణ పరికరాల వనరులను వైవిధ్యపరచడానికి ప్రయత్నిస్తోంది. వీటిలో ఎక్కువ భాగం రష్యా నుంచి తీసుకోబోతంది. అలాగే జపాన్ భారత్ కు షిప్ యాంటెన్నాల బదిలీని పెంచింది. రక్షణ రంగంలో సహకారం భారత్-జపాన్ మధ్య బలమైన విజయగాథ అని మోడీ తెలిపారు.

రక్షణ సాంకేతిక రంగంలో జపాన్ కూడా తిరుగులేని రికార్డును కలిగి ఉందని మోడీ తెలిపారు. రాజకీయ విశ్వాసం , సహజ పరిపూరకాలతో కలిసి, మన కోసమే కాకుండా, ప్రపంచం కోసం కూడా తదుపరి తరం రక్షణ వేదికలను రూపొందించవచ్చని మోడీ తెలిపారు. తద్వారా మూడవ ప్రపంచ దేశాలకు అమ్మకాలపై దృష్టి సారించి సహకారాన్ని కోరుతున్నారు. జపాన్, భారత్, అమెరికా, ఆస్ట్రేలియతో కూడిన క్వాడ్ కూటమి సముద్ర భద్రత, విపత్తు ఉపశమనం , అంతరిక్ష సహకారాన్ని కవర్ చేయడానికి ఎలా విస్తరించిందో మోడీ ప్రస్తావించారు. క్వాడ్ భాగస్వామి అయిన జపాన్ తో భాగస్వామ్యాన్ని విలువైనదిగా భావిస్తున్నట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications