వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్‌పై ప్రపంచబ్యాంకు వరాల జల్లు: లాక్‌డౌన్‌లో రెండోసారి: కరోనాపై అసమాన పోరాటానికి

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: ప్రపంచ ఆర్థిక సంస్థ మనదేశంపై రెండోసారి వరాల జల్లును కురిపించింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి దేశవ్యాప్తంగా అమలు చేస్తోన్న లాక్‌డౌన్ పరిస్థితులను కట్టుదిట్టంగా అమలు చేయడం, కరోనా నియంత్రణ కోసం చేపట్టిన చర్యలకు ఊతం కల్పించడానికి ఒక బిలియన్ డాలర్ల ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. ఈ మేరకు ప్రపంచబ్యాంకు ప్రధాన కార్యాలయంలో ఏర్పాటైన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల బోర్డు సమావేశంలో దీనికి సంబంధించిన ప్రతిపాదనలను ఆమోదించింది. లాక్‌డౌన్ ప్రకటించిన తరువాత ప్రపంచబ్యాంకు మనదేశానికి భారీ ఎత్తున నిధులను ప్రకటించడం ఇది రెండోసారి.

Recommended Video

World Bank Announces USD 1 Billion Social Protection Package for India

ఏపీకి తొలగని ఎంఫాన్ ముప్పు: మరింత బలోపేతం: 18 తరువాత భారీ వర్షాలు: నైరుతి రాకలో జాప్యంఏపీకి తొలగని ఎంఫాన్ ముప్పు: మరింత బలోపేతం: 18 తరువాత భారీ వర్షాలు: నైరుతి రాకలో జాప్యం

గరీబ్ కల్యాణ్ యోజనపై ప్రశంసలు..

గరీబ్ కల్యాణ్ యోజనపై ప్రశంసలు..

ఇదివరకు ఒకసారి ఒక బిలియన్ డాలర్ల నిధులను మంజూరు చేసిన విషయం తెలిసిందే. కరోనా వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి మనదేశం చేపట్టిన చర్యల్లో వేగం పెంచడానికి సోషియల్ ప్రొటెక్షన్ రెస్పాన్స్ ప్రోగ్రామ్ కింద ఈ నిధులను మంజూరు చేస్తున్నట్లు ప్రపంచబ్యాంకు వెల్లడించింది. లాక్‌డౌన్ అమల్లో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో సామాజిక భద్రత కింద కేంద్ర ప్రభుత్వం పేదలకు అందజేస్తోన్న ఆర్థిక సహాయ కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకుని ప్రపంచబ్యాంకు ఈ నిధులను మంజూరు చేసింది. గరీబ్ కల్యాణ్ యోజన వంటి పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తోందని ప్రశంసించింది.

రెండు దశల్లో మంజూరు

రెండు దశల్లో మంజూరు

ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల బోర్డు నుంచి ఆమోదముద్ర పొందిన ఈ మొత్తాన్ని ప్రపంచబ్యాంకు రెండు దశల్లో భారత్‌కు మంజూరు చేస్తుంది. ఈ రెండు విడతలను కూడా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోపే విడుదల చేస్తుంది. లాక్‌డౌన్ సమయంలో భారత ప్రభుత్వం పేదలను ఆదుకోవడమే లక్ష్యంగా పని చేస్తోందని ప్రపంచబ్యాంకు పేర్కొంది. ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్), డైరెక్టర్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్స్ (డీబీటీ) వంటి పథకాలను అమలు చేయడం వల్ల పేదలకు లబ్ది కలిగిస్తోందని పేర్కొంది. కరోనా వైరస్‌ వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదురైనప్పటికీ.. దాన్ని అధిగమించి పేదలకు అండగా ఉంటోందని వెల్లడించింది.

 ఆర్థిక వనరులు స్తంభించిన వేళ..

ఆర్థిక వనరులు స్తంభించిన వేళ..

లాక్‌డౌన్ వల్ల ప్రపంచవ్యాప్తంగా అన్ని రకాల కార్యకలాపాలు స్తంభించిపోయాయని, భారత ఆర్థిక వ్యవస్థపైనా దాని ప్రభావం పడిందని పేర్కొన్న ప్రపంచబ్యాంకు..ఇలాంటి పరిస్థితుల్లోనూ ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన వంటి పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయడం సాహసంతో కూడుకున్న చర్యగా అభివర్ణించింది. ఈ పథకం కింద పేదలకు 500 రూపాయల నగదును చెల్లిస్తోన్న విషయం తెలిసిందే. భారత్‌లో 90 శాతం మందికి పైగా అసంఘటిత రంగాల్లో పని చేస్తున్నారని, వారికి సామాజిక భద్రతను కల్పించడంలో భారత ప్రభుత్వం తీసుకున్న చర్యల ప్రశంసనీయమైనవని పేర్కొంది.

English summary
The World Bank has announced that its board of executive directors have approved a $1 billion support plan for India as part of the ‘Accelerating India’s COVID-19 Social Protection Response Program’. With this support, the total commitment from World Bank to India to tackle COVID-19 is $2 billion. Last month, it announced a $1 billion support for the country’s healthcare sector. World Bank said in a statement that this will support India’s efforts at providing social assistance to the poor and vulnerable households impacted by COVID-19.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X