ట్రంప్ కు మరో బిగ్ షాక్ ఇవ్వబోతున్న మోడీ-పుతిన్..! కీలక పరిణామాలు..!
రష్యా చమురు కొంటూ ఉక్రెయిన్ పై ఆ దేశం చేస్తున్న యుద్ధంలో సహకరిస్తున్నామన్న కారణంతో భారత్ పై సుంకాలు విధిస్తున్న అమెరికాకు ఇప్పుడు రెండు దేశాలు మరో షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే అమెరికా సుంకాల పెంపును పట్టించుకోకుండా చమురు కొనుగోళ్లు కొనసాగిస్తున్న ఇరు దేశాలూ.. ఇప్పుడు మరో కీలక అడుగు వేశాయి. ఈ మేరకు ఇప్పటికే చర్చల దశ దాటి నిర్ణయాలు కూడా తీసేసుకున్నారు. త్వరలో దీని ప్రభావం కనిపించనుంది.
రష్యా చమురు కొనుగోళ్లను కారణంగా చూపుతూ ట్రంప్ పై మనపై సుంకాలు విధిస్తున్నా పట్టించుకోకుండా దూకుడుగా ముందుకెళ్తున్న ప్రధాని మోడీ.. రష్యాకు మరింత దగ్గరవుతున్నారు. తాజాగా షాంఘై సహకార సమాఖ్య భేటీలో రష్యా, చైనా అధినేతలు పుతిన్, జిన్ పింగ్ తో అత్యంత సన్నిహితంగా మెలిగిన మోడీ.. ట్రంప్ కు ఇవ్వాల్సిన సందేశం ఇచ్చేశారు. ఇప్పుడు దానికి కొనాసాగింపుగా రష్యా నుంచి అత్యాధునిక ఎస్ 400 క్షిపణి రక్షణ వ్యవస్థలను కొనుగోలుపై ముందుకెళ్తుున్నారు.

ఇప్పటికే పాకిస్తాన్ తో జరిగిన ఆపరేషన్ సింధూర్ లో రష్యా తయారీ ఎస్ 400 క్షిపణి రక్షణ వ్యవస్దలు భారత్ ను ఎంతగానే ఆదుకున్నాయి. తొలిసారి వీటిని వాడిన భారత్ కు వీటి సత్తా ఏంటో తెలిసొచ్చింది. దీంతో ఆపరేషన్ సింధూర్ ముగిశాక ఇలాంటివే మరిన్ని ఆయుధ రక్షణ వ్యవస్దలు కావాలంటూ భారత్ ఆర్డర్లు పెట్టింది. వీటికి ఆమోదం తెలుపుతూ రష్యా తాజాగా పని మొదలుపెట్టేసింది. వచ్చే ఏడాది నాటికి భారత్ కోరిన ఎస్ 400 ఆయుధ రక్షణ వ్యవస్థల్ని సరఫరా చేసేందుకు సిద్ధమవుతోంది.

వచ్చే ఏడాది నుంచి ఏడాదికి ఒక ఎస్ 400 చొప్పన భారత్ కు సరఫరా చేసే దశగా రష్యా అడుగులేస్తోంది. వాస్తవానికి 2018లో రష్యాకు పెట్టిన ఐదు ఎస్ 400 వ్యవస్థల ఆర్డర్ లో ఇవి భాగమే. అయితే గతంలో మూడు ఎస్ 400లు ఇచ్చిన తర్వాత భారత్ కూడా దీనిపై మౌనంగానే ఉండటంతో రష్యా కూడా మిగిలిన వాటి తయారీపై వేగంగా దృష్టిపెట్టలేదు. కానీ మారిన పరిస్ధితుల్లో మిగిలిన రెండింటినీ కూడా తయారు చేసి ఇవ్వాలని భారత్ కోరింది. దీంతో రష్యా పని వేగవంతం చేసింది. ఓవైపు రష్యా నుంచి చమురుతో పాటు ఆయుధాల్నీ కొంటున్నా కారణంగా భారత్ పై అత్యధిక సుంకాలు విధిస్తున్న ట్రంప్.. ఇప్పుడు ఆ రెండు ఎస్ 400లు కూడా తీసుకుంటే ఏం చేస్తారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.












Click it and Unblock the Notifications