రంగంలోని భారత్.. ఇరాన్ కు సీరియస్ వార్నింగ్..
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు ఏమాత్రం తగ్గడం లేదు. ప్రపంచ దేశాలకు కీలకమైన హార్మూజ్ జలసంధి వద్ద పరిస్థితి అంతకంతకూ తీవ్ర తరం అవుతోంది. తాజాగా హార్మూజ్ జలసంధిని దాటిన భారత జెండాలు కలిగిన రెండు నౌకలను ఇరాన్ కు చెందిన గన్ బోట్స్ కాల్చేశాయి. అయితే భారత నౌకలపై దాడిని భారత్ తీవ్రంగా ఖండించింది. ఇరాన్ వైఖరి పట్ల తీవ్ర ఆందోళన, నిరసన వ్యక్తం చేసింది. ఇక ప్రపంచ దేశాల వాణిజ్యానికి కీలకమైన హార్మూజ్ జలసంధిపై ఇరాన్- అమెరికా పెత్తనం చెలాయిస్తున్నాయి. ఓ వైపు హార్మూజ్ ను పూర్తిగా దిగ్బంధనం చేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటన నేపథ్యంలో.. హార్మూజ్ జలసంధిని పూర్తిగా మూసేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించడం ఆందోళన కలిగిస్తోంది.
హార్మూజ్ జలసంధి విషయంలో ఇరాన్, అమెరికా వరుసబెట్టి వార్నింగ్ చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. ఇరాన్- అమెరికా మధ్య యుద్ధం ప్రారంభమైనప్పటినుంచి మూసివేసిన హార్మూజ్ జలసంధిని ఇటీవల ఓపెన్ చేసినట్లు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అగార్చీ పేర్కొన్నారు. అయితే తాజాగా మరోసారి హార్మూజ్ జలసంధిని ఇరాన్ ప్రకటించింది. అంతేకాక హార్మూజ్ గుండా ప్రయాణిస్తున్న నౌకలపై ఇరాన్ కు చెందిన గన్ బోట్స్ దాడులకు పాల్పడుతున్నాయి. ఈ క్రమంలో భారత్ జెండాలు కలిగిన రెండు నౌకలపై ఇరాన్ గన్ బోట్స్ కాల్పులు జరిపాయి. ఈ విషయంలో ఇరాన్ పై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

దేశ రాజధాని న్యూదిల్లీలోని ఇరాన్ రాయబారిని ఈ మేరకు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ పిలిపించి మరీ విషయాలను అడిగి తెలుసుకుంది. ఈ మేరకు ఇరాన్ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. నౌకలు, సిబ్బంది భద్రత తమకు ముఖ్యమని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఈ ఘటనపై ఇరాన్ వెంటనే దృష్టి సారించాలని పేర్కొంది. ఈ మేరకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ ఎక్స్ వేదికగా ఓ ప్రకటన విడుదల చేశారు. భారత్ నౌకలు హార్మూజ్ గుండా ఇదివరకు మాదిరిగానే సేఫ్ గా ప్రయాణించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.












Click it and Unblock the Notifications