లాడెన్ హిట్ లిస్ట్‌లో భారత్.. తెరపైకి వచ్చిన 28 ఏళ్ల నాటి రహస్యం!

అమెరికా నిఘా సంస్థ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ(సీఐఏ) విడుదల చేసిన అత్యంత రహస్య పత్రాలలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. 2001 సెప్టెంబర్ 11న న్యూయార్క్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై అల్-ఖైదా జరిపిన ఉగ్రదాడికి ముందు నుంచే మాజీ అల్-ఖైదా అధినేత ఒసామా బిన్ లాడెన్ దాడి చేయాలనుకున్న దేశాల జాబితాలో భారత్ కూడా ఉందని ఈ పత్రాలు స్పష్టం చేస్తున్నాయి.

Modi-Xi Jinping: కలిసే ముందుకెళ్దాం- మోడీ-షీ జిన్ పింగ్ ప్రతిన..!
Modi-Xi Jinping: కలిసే ముందుకెళ్దాం- మోడీ-షీ జిన్ పింగ్ ప్రతిన..!

25వ వార్షికోత్సవం సందర్భంగా పత్రాల విడుదల
2001లో అమెరికాపై జరిగిన 9/11 దాడుల వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని సీఐఏ శుక్రవారం దాదాపు 70కి పైగా అధ్యక్షుడి కోసం తయాలు చేసిన నిఘా నివేదికల్లో 100 పేజీలకు పైగా ఉన్న రహస్య పత్రాలను బహిర్గతం చేసింది. బిల్ క్లింటన్, జార్జ్ డబ్ల్యూ బుష్ హయాంలో అధ్యక్షులకు అమెరికా నిఘా సంస్థలు అందించిన నివేదికలు ఇందులో ఉన్నాయి.

India Was On Osama Bin Laden Hit List Before 9 11 CIA Declassified Documents Revealed Full Details Here

1998 నాటి మెమోలో భారత్ ప్రస్తావన
1998 ఆగస్టు 28 నాటి 'బిన్ లాడెన్ టెర్రరిస్ట్ నెట్వర్క్ స్టిల్ ఎ థ్రెట్' అనే శీర్షికతో ఉన్న ఒక ఇంటెలిజెన్స్ నివేదికలో ఈ వివరాలు ఉన్నాయి. బిన్ లాడెన్ ఇండియాతో పాటు పాకిస్తాన్, ఈజిప్ట్, కువైట్, సౌదీ అరేబియా, యెమెన్, ఉగాండా, నైజీరియా వంటి పలు దేశాల్లో దాడులు చేయడానికి ప్లాన్స్ సిద్ధం చేస్తున్నట్లు ఆ నివేదిక పేర్కొంది. అయితే ఈ పత్రాల్లో ఇండియాలో ఎక్కడ దాడి చేయాలనుకున్నారనే నిర్దిష్ట ప్రదేశం, తేదీ లేదా స్పష్టమైన ఆపరేషనల్ ప్లాన్ వివరాలు మాత్రం పేర్కొనలేదు.

అమెరికా దాడుల అనంతరం కూడా చెక్కుచెదరని నెట్వర్క్
అఫ్గానిస్తాన్‌లోని అల్-ఖైదా స్థావరాలపై అమెరికా క్షిపణి దాడులు జరిపినప్పటికీ.. బిన్ లాడెన్, ఇతర తీవ్రవాద నాయకులు తప్పించుకున్నారని సీఐఏ అంచనా వేసింది. వారి కమ్యూనికేషన్ వ్యవస్థలు దెబ్బతినకుండా అలాగే ఉన్నాయని.. అఫ్గానిస్తాన్‌లో శిక్షణా శిబిరాలను మళ్లీ ప్రారంభించారని ఆ పత్రాలు తెలిపాయి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 60 దేశాల్లో ఉన్న తన అనుబంధ ఉగ్రవాద సంస్థలు, వ్యక్తుల నెట్వర్క్ సహాయంతో దాడులు జరిపించే శక్తి బిన్ లాడెన్‌కు ఉందని ఆనాడే సీఐఏ హెచ్చరించింది.

హూతీల చేతికి బాబ్ ఎల్-మాండెబ్..! 3వేల కి.మీ దూరంలో భారత్ కు మరో టెన్షన్..!
హూతీల చేతికి బాబ్ ఎల్-మాండెబ్..! 3వేల కి.మీ దూరంలో భారత్ కు మరో టెన్షన్..!

ముందస్తు హెచ్చరికలు పెడచెవిన పెట్టారా?
అమెరికాపై ఉగ్రదాడి జరిగే అవకాశం ఉందని 1998 నుంచి 2001 మధ్య కాలంలో సీఐఏ పలుమార్లు అమెరికా అధ్యక్షులను హెచ్చరించిందని ఆ పత్రాలు నిరూపిస్తున్నాయి. తమ దేశంలోనే విమానాలను రవాణా సాధనాలుగా కాకుండా ఆత్మాహుతి ఆయుధాలుగా వాడి నగరాలపై దాడి చేయవచ్చనే హెచ్చరికలు కూడా ఉన్నాయి.

9/11 ఘోరకలి
ఈ హెచ్చరికలు వచ్చిన కొద్ది కాలానికే సెప్టెంబర్ 11, 2001న 19 మంది అల్-ఖైదా తీవ్రవాదులు 4 ప్రయాణీకుల విమానాలను హైజాక్ చేశారు. అందులో రెండు విమానాలు న్యూయార్క్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ ట్విన్ టవర్స్ ను ఢీకొట్టడంతో అవి నేలమట్టమయ్యాయి. మూడో విమానం పెంటగాన్ భవనాన్ని ఢీకొట్టగా.. నాలుగో విమానం పెన్సిల్వేనియాలోని ఓ పొలంలో కూలిపోయింది. ఈ దాడిలో దాదాపు 3 వేల మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+