అమెరికా నుంచి భారత్ కు అపాచీ హెలికాప్టర్లు.. ఇక బోర్డర్ లో పాకిస్థాన్ కు చుక్కలే..
భారత్ కు సరిహద్దు దేశాలైన పాకిస్థాన్, చైనాలతో ఎప్పుడూ ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంటుంది. ఇరు దేశాలతో సరిహద్దు వివాదాల నేపథ్యంలో రక్షణ రంగంపై భారీగా ఖర్చు పెట్టి అత్యాధునిక ఆయుధ సామాగ్రిని కొనుగోలు చేస్తోంది భారత్. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఆయుధాలను సమకూర్చుకుంటోంది.
సరిహద్దు దేశాలతో ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో అత్యాధునిక, శక్తివంతమైన ఆయుధాలను భారత అమ్మల పొదిలోకి చేర్చుతోంది రక్షణ శాఖ. తాజాగా అమెరికా నుంచి మూడు అపాచీ హెలికాప్టర్లు భారత్ లోకి రానున్నాయి. దీంతో భారత్ డిఫెన్స్ రంగం మరింత శక్తివంతంగా మారినట్లు చెప్పవచ్చు. ఎన్నో ఏళ్ల నుంచి అపాచీ హెలికాప్టర్ల కోసం భారత్ ఎదురుచూస్తోంది. ఎట్టకేలకు ఈ నెలలోనే ఇవి భారత్ లోకి అడుగు పెట్టనున్నాయి.
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు తమ రక్షణ రంగాన్ని బలోపేతం చేసుకునే పనిలో పడ్డాయి. రష్యా- ఉక్రెయిన్ యుద్ధం, ఇరాన్- ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా అనేక దేశాలు తమ ఆయుధ సంపత్తిని మరింత పెంచుకునేందుకు సిద్దం అవుతున్నాయి. ఇక భారత్ కు సరిహద్దు దేశాలైన పాకిస్థాన్, చైనాలతో ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవలే భారత నేవీ రంగాన్ని మరింత పటిష్టం చేసేందుకు మోస్ట్ అడ్వాన్స్ డ్ స్టీల్త్ ఫ్రిగేట్ రంగానికి చెందిన INS తమాల్ యుద్ధ నౌక సేవలను ప్రారంభించింది భారత నౌకాదళం.
🚨 BIG BREAKING
— Megh Updates 🚨™ (@MeghUpdates) July 2, 2025
🇮🇳 Indian Army to finally receive its first batch of Apache attack helicopters by July-end 🔥
— Boeing to complete delivery of all 6 Apaches by October 2025. pic.twitter.com/6trHbTpjiV
తాజాగా భారత రక్షణ వ్యవస్థలో మరో కీలక ముందడుగు పడింది. భారత్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అపాచీ హెలికాప్టర్లు ఈ నెలలోనే భారత్ లోకి రానున్నాయి. అమెరికా నుంచి మూడు అపాచీ హెలికాప్టర్లు ఈ నెలాఖరులోగా వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అమెరికా- భారత్ మధ్య 2020లో 600 మిలియన్ల డాలర్లతో ఈ ఒప్పందం కుదిరింది. ఈ డీల్ ప్రకారం భారత్ కు అమెరికా ఆరు అపాచీ హెలికాప్టర్లను అందించాల్సి ఉంటుంది.

అమెరికా నుంచి అపాచీ హెలికాప్టర్ లు ఎప్పుడో రావాల్సి ఉంది. కానీ కరోనా, ఇతర కారణాలతో డెలివరీకి 15 నెలలకు పైగా ఆలస్యం అయింది. అయితే ఈ నెలాఖరులో మొదటి బ్యాచ్ గా 3 అపాచీ హెలికాఫ్టర్లు పంపిస్తామని యూఎస్ కు చెందిన మ్యానిఫ్యాక్చరింగ్ కంపెనీ తాజాగా తెలిపింది. వీటిని పాకిస్థాన్ బోర్డర్ లో గస్తీని ఉపయోగించేందుకు భారత్ సిద్ధమవుతోంది.
-
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Eid-ul-Fitr 2026 Ramzan: రంజాన్ ఎప్పుడంటే ? సౌదీ అరేబియా ప్రకటన..! భారత్ లో..! -
INSPIRING STORY : నాడు రోజుకు రూ.5 రైతు కూలీ.. నేడు ఆక్స్‌ఫర్డ్‌లో "ఏఐ" పై ప్రసంగం..! -
పాకిస్థాన్- అఫ్గానిస్థాన్ యుద్ధానికి రంజాన్ సెలవులు..! -
అమెరికాకు గుడ్ బై చెప్తే.. భారీగా డబ్బు, ఫ్రీ ఫ్లైట్ టికెట్ -
ఇగో తగ్గని ప్లేయర్లు.. దిక్కులేని బోర్డు.. పాక్ క్రికెట్‌ను ముంచేది వీళ్లేనా? -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి












Click it and Unblock the Notifications