Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అమెరికా చర్యను స్వాగతించిన భారత్..

Pahalgam Terror Attack: ప్రపంచం మొత్తాన్నీ ఉలిక్కిపడేలా చేసిన ఉదంతం.. పహల్గామ్ ఉగ్రదాడి. 26 మందిని పొట్టనబెట్టుకున్న ఉగ్రవాదుల ఘాతుకానికి అమెరికా మొదలుకుని ఆఫ్ఘనిస్తాన్ దాకా దాదాపుగా అన్ని దేశాలు స్పందించాయి. భారత్‌కు అండగా నిలిచాయి. ఉగ్రవాద నిర్మూలనకు సహకరిస్తామని వెల్లడించాయి.

ఈ దిగ్భ్రాంతికర ఘటనను కేంద్ర ప్రభుత్వం అత్యంత తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంది. పాకిస్తాన్‌పై కఠిన ఆంక్షలను విధించింది. ఇండస్ రివర్ ట్రీటీ సహా పలు కీలక నిర్ణయాలను అమలులోకి తీసుకొచ్చింది. అట్టారీ-వాఘా సరిహద్దు చెక్‌పోస్ట్‌ను మూసివేయడమే కాకుండా దేశంలో నివస్తోన్న పాకిస్తానీయులనూ స్వదేశానికి వెళ్లిపోవాలంటూ ఆదేశించింది.

India Welcomes US decision against TRF

ఈ దాడి ఘటనలో భారత్ తాజాగా తిరుగులేని విజయాన్ని అందుకుంది. ఈ ఘాతుకానికి పాల్పడిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF)ను అమెరికా అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థల జాబితాలో చేర్చింది. విదేశీ ఉగ్రవాద సంస్థ (FTO), స్పెషల్లీ డిజిగ్నేటెడ్ గ్లోబల్ టెర్రరిస్ట్ (SDGT)గా ప్రకటించింది. దీనిపై ఆ దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ మేరకు అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో ఒక ప్రకటన విడుదల చేశారు. దీంతో.. అల్-షబాబ్, బోకో హరామ్, ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ISIS), హమాస్, హిజ్బుల్లా, ఇస్లామిక్ జిహాద్ యూనియన్ వంటి ఇతర భయానక ఉగ్రవాద సంస్థల జాబితాలో టీఆర్ఎఫ్ కూడా చేరినట్టయింది. అటు పాకిస్తాన్ కూ బిగ్ షాక్ ఇచ్చినట్టే అయింది.

ఈ ఏడాది ఏప్రిల్ 22వ తేదీన పహల్గామ్‌లో జరిగిన దారుణ ఉగ్రదాడికి TRF బాధ్యత వహించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికా తీసుకున్న నిర్ణయం ఉగ్రవాదంపై పోరాటంలో భారత్ సాధించిన ఘన విజయంగా చెప్పుకోవచ్చు. పహల్గామ్ దాడి బాధితులకు న్యాయం చేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పిలుపునిచ్చారని, ఈ మేరకు టీఆర్ఎఫ్ ను అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థగా గుర్తించినట్లు మార్కొ రూబియో తెలిపారు.

అమెరికా తీసుకున్న ఈ నిర్ణయం పట్ల భారత్ హర్షం వ్యక్తం చేసింది. దీన్ని స్వాగతించింది. టీఆర్ఎఫ్ ను అంతర్జాతీయ ఉగ్రవాద గ్రూపుల జాబితాలో చేర్చినందుకు కృతజ్ఞతలు తెలిపింది. ఈ మేరకు అమెరికాలోని భారత రాయబార కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.

ఉగ్రవాదం, ఉగ్రవాదుల కార్యకలాపాలు, దాడులను ఎట్టి పరిస్థితుల్లోనూ తాము సహించబోయేది లేదని పేర్కొంది. ఉగ్రవాదంపై సుదీర్ఘకాలంగా పోరాటం సాగిస్తోన్నామని గుర్తు చేసింది. ఈ విషయంలో ప్రపంచ దేశాల మద్దతును సైతం కూడగట్టుకుంటోన్నామని పేర్కొంది.

టీఆర్ఎఫ్ వంటి కరడుగట్టిన ఉగ్రవాద సంస్థకు వ్యతిరేకంగా అమెరికా తీసుకున్న నిర్ణయం- ఉగ్రవాదంపై పోరాడటానికి నిదర్శనమని ఎంబసీ వ్యాఖ్యానించింది. రెండు దేశాల మధ్య పరస్పర సహకారానికి తాజా ఉదాహరణగా పేర్కొంది. TRF అనేది లష్కరే తోయిబా ప్రాక్సీ సంస్థగా అభివర్ణించింది ఎంబసీ.

పహల్గామ్ దాడి అనంతరం భారత చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించింది. విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ అమెరికాలో పర్యటించారు. అక్కడి అధికారులతో చర్చలు జరిపారు. అదే సమయంలో, కాంగ్రెస్ లోక్ సభ సభ్యుడు శశి థరూర్ నేతృత్వంలో ఎంపీలతో కూడిన ఏడు బృందాలు.. దాదాపుగా అన్ని దేశాల్లో పర్యటించాయి. పహల్గామ్ ఉగ్రదాడిని ప్రపంచ దేశాలకు వివరించాయి. టీఆర్ఎఫ్ ఉగ్రవాద కార్యకలాపాలను తెలియజేస్తూ మద్దతు కూడగట్టే ప్రయత్నం చేశాయి.

అనంతరం విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ కూడా క్వాడ్ సమ్మిట్ కోసం అమెరికాలో పర్యటించారు. మార్కో రూబియోతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. పహల్గామ్ ఉగ్రదాడిలో TRF ప్రత్యక్ష ప్రమేయం గురించి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికీ తెలియజేసింది. తద్వారా అంతర్జాతీయంగా ఒత్తిడి పెంచే ప్రయత్నం చేసింది.

అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థగా గుర్తించడం వల్ల చట్టపరంగా చాలా కఠినమైన పరిణామాలను టీఆర్ఎఫ్ ఎదుర్కొనాల్సి ఉంటుంది. ఆ సంస్థకు అమెరికన్లు లేదా సంస్థలు ఎటువంటి సహాయం అందించకుండా ఆర్థికపరమైన ఆంక్షలు ఎదుర్కోవలసి వస్తుంది. ఈ సంస్థకు మద్దతు తెలిపే వారికి అమెరికాలో ప్రవేశం లభించదు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+