వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్ 2028 నాటికి చైనా జనాభాను మించిపోతుంది

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: భారత దేశ జనాభా 2028 నాటికి చైనా దేశాన్ని మించిపోతుందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. భారత దేశంలో పెరుగుతున్న జననాల రేటును పరిశీలిస్తే మన దేశ జనాభా చైనాను మించిపోతుందని చెప్పారు. 2012 జనాభా లెక్కల ప్రకారం జననాల రేటు ఆధారంగా పరిశీలిస్తే 2028 నాటికి చైనా కంటే అధికమవుతుందని చెప్పారు.

ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా రాజ్యసభలో వెల్లడించారు. చైనాలో జననాల రేటు కంటే భారత దేశంలో జననాల రేటు ఎక్కువగా ఉందని చెప్పారు. జనాభా నియంత్రణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ప్రభావవంతంగా లేవని చెప్పారు.

 India will overtake China in population growth by 2028, says Health Minister

కాగా, మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం ఎక్కడున్నదీ తమకు తెలియదని కేంద్ర ప్రభుత్వం మంగళవారం పార్లమెంటులో స్పష్టం చేసిన విషయం తెలిసిందే. దావూద్ పాకిస్తాన్‌లోనే ఉన్నాడంటూ గతంలో ప్రకటనలు వెలువడిన నేపథ్యంలో కేంద్రం ఈ విషయాన్ని వెల్లడించడం సర్వత్రా విస్మయాన్ని కలిగించింది.

దావూద్‌ను అప్పగించాలంటూ పాకిస్తాన్‌కు గతంలో అనేకసార్లు భారత్ విజ్ఞప్తి చేసింది. దావూద్ అప్పగింతకు సంబంధించి ఇంతవరకూ ఎలాంటి ప్రక్రియ మొదలుకాలేదని, ఆచూకీ తెలిసిన వెంటనే ఆ దిశగా చర్యలు చేపడుతామని హోమ్‌శాఖ సహాయ మంత్రి హరిభాయ్ చౌదరి ఓ లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.

English summary
The government on Tuesday said that the birth rate in India is greater than that of China and said the country's population will cross China's by 2028.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X