పక్కనే భార్య, విమానంలోనే లైంగిక వేధింపుల ఆరోపణలు: ఎన్‌ఆర్‌ఐ రామ్మూర్తి అరెస్ట్

Posted By:
Subscribe to Oneindia Telugu

మిచిగాన్: భారత సంతతికి చెందిన ప్రభు రామ్మూర్తి అనే 34 వ్యక్తి విమానంలో తన పక్కనే నిద్రలో‌ ఉన్న మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడనే ఆరోపణలతో అరెస్టు చేశారు.

లాస్‌వెగాస్ నుండి డెట్రాయిట్‌కు విమానంలో వెళ్తున్న సమయంలో గురువారం నాడు ఈ ఘటన చోటు చేసుకొందని మిచిగాన్ పోలీసులు తెలిపారు.బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడు రామ్మూర్తిని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు

Indian Accused Of Groping Sleeping Woman On US Plane With Wife Beside Him

తాను నిద్రలో ఉన్న సమయంలో బాధితురాలి చొక్కా, ప్యాంట్ గుండీలు తీసి ఉన్నాయి. తనకు మెలకువ వచ్చేసరికి బాధితురాలి ప్యాంట్ లోపల రామ్మూర్తి చేతులున్నాయని ఆమె ఆరోపిస్తున్నారు.

బాధితురాలు మెలకువ వచ్చిన తర్వాత ఈ విషయాన్ని గమనించింది విమాన సిబ్బందికి ఫిర్యాదు చేసింది.అయితే రామ్మూర్తి పక్కనే ఆయన భార్య ఉన్న సమయంలోనే ఈ ఘటన చోటు చేసుకొంది. ఈ విషయమై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

రామ్మూర్తితో పాటు ఆయన భార్య కూడ టెంపరరీ వీసాపై అమెరికాలో నివాసం ఉంటున్నారు.రామ్మూర్తి రెండున్నర ఏళ్ళుగా ఓ సాప్ట్‌వేర్ కంపెనీలో ప్రాజెక్టు మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. అయితే ఆయనపై ఇప్పటివరకు ఎలాంటి అభియోగాలు లేవని రామ్మూర్తి లాయర్ కోర్టులో తన వాదనను విన్పించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Federal authorities in Michigan arrested a 34-year-old man after a woman said that he sexually assaulted her on an overnight flight when she fell asleep next to him.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి