తాలిబన్ల కాల్పులు: భారతీయుడితోపాటు 9మంది మృతి

అఫ్ఘాన్ అంతర్గత వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి సెదిక్ సెదిక్కి ఈ ఘటనపై మాట్లాడుతూ.. దాడికి పాల్పడిన వారిలో వయుకులే ఉన్నారని, చిన్నపాటి పరిమాణం ఉన్న తుపాకులను, ఇతర ఆయుధాలను వారి బూట్ల సాక్సుల్లో పెట్టుకుని వచ్చి భద్రతా సిబ్బంది తనిఖీల నుంచి భయటపడ్డారని తెలిపారు.
గురువారం రోజు హోటల్ మూసివేసే సమయం రాత్రి 8.30గంటలకు సంప్రదాయ అఫ్ఘానీ దుస్తుల్లో హోటల్లోకి ప్రవేశించిన తాలిబన్లు కాల్పులకు పాల్పడినట్లు ఆయన చెప్పారు. కాల్పుల్లో మరణించిన వారిలో భారతదేశానికి చెందిన వ్యక్తితోపాటు న్యూజిలాండ్, కెనడా, పాకిస్థాన్ దేశాలకు చెందిన ఒక్కొక్కరు ఉన్నారని తెలిపారు.
తమ దేశానికి చెందిన ఐదుగురు మృతి చెందారని, వారిలో ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని పేర్కొన్నారు.
ఈ దాడికి రూపకల్పన తమ దేశం బయటే జరిగి ఉంటుందని సిదిక్కి తెలిపారు. పాకిస్థాన్ ప్రభుత్వానికి, తాలిబన్లకు మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరుగుతుందని తాను ఆశిస్తున్నట్లు చెప్పారు.
కాల్పుల విరమణ జరగకపోతే ఎన్నికలతో ఎలాంటి ప్రయోజనం ఉండదని తెలిపారు. గత జనవరిలో కూడా విదేశీయులు ఉన్న రెస్టారెంటు మీద కాల్పులు జరిపిన తాలిబన్లు 21 మందిని పొట్టన పెట్టుకున్నారు.












Click it and Unblock the Notifications