భారత వైద్యుడి కాల్చివేత: స్నేహితుడే హంతకుడు

న్యూయార్క్: అమెరికాలోని టెక్సాస్‌ రాష్ట్రంలో ప్రముఖ కార్డియాలజిస్టుగా పేరున్న భారతీయ వైద్యుడు డా. సురేశ్‌ గడసల్లి(53) హత్యకు గురయ్యారు. పేషెంటుగా ఆస్పత్రిలో చేరిన ఆయన స్నేహితుడు, వ్యాపార భాగస్వామి కూడా అయిన అయ్యసామి తంగమ్‌(60) తుపాకీతో కాల్చి చంపాడు.

పోలీసుల కథనం ప్రకారం.. ఈ ఘటన గత గురువారం టెక్సాస్‌ రాష్ట్రంలోని ఒడెస్సా నగరంలోని హెల్తీ హార్ట్‌ సెంటర్‌లో చోటు చేసుకుంది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. అయ్యసామి తలుపులు వేసి కాల్పులు జరపగా సురేశ్‌ మృతి చెందారు.

అనంతరం అయ్యసామి సైతం ఆత్మహత్య చేసుకున్నాడు. డాక్టర్‌ సురేశ్‌ అంత్యక్రియలు బుధవారం జరుగుతాయని ఒడెస్సా పోలీసులు తెలిపారు. ఆయన అక్కడ ప్రముఖ డాక్టరు కావడంతో విషయం తెలిసి, నగరానికి చెందిన దాదాపు రెండు లక్షలకు పైగా మంది ప్రజలు దిగ్ర్భాంతికి గురయ్యారు.

Indian cardiologist shot dead in Texas

డాక్టర్‌ సురేశ్‌ది కర్ణాటకలోని బెంగళూరు. భారత్‌లో వైద్య విద్యను అభ్యసించిన ఆయన విస్కాన్సిన్‌, మిల్‌వాకీలలో కార్డియాలజీలో ఉన్నత విద్యను అభ్యసించారు. 1994లో టెక్సాస్‌లోని ఒడెస్సా మెడికల్‌ సెంటర్‌లో వైద్యుడిగా నియమితులయ్యారు.

అంతేగాక, ఆయన అంతర్జాతీయ కార్డియాలజిస్టుల అసోసియేషన్‌లో ప్రముఖవైద్యుడిగా గుర్తింపు పొందారు. కాగా, తంగమ్‌ ఎందుకు ఈ దారుణానికి పాల్పడ్డాడో, ఆయన ఏ రోగానికి.. సురేశ్‌ వద్ద చికిత్స పొందుతున్నారో తెలియలేదని పోలీసులు చెప్పారు. కేసు నమోదు చేసుకుని, కేసు దర్యాప్తు చేస్తున్నారు.

కాగా, వైద్యుడు సురేష్‌కి భార్య ఆరతి, ఇద్దరు పిల్లలు సంజయ్, దివ్య ఉన్నారు. సంజయ్ ఇటీవలే మెడికల్ స్కూల్ ప్రారంభించగా, దివ్య బిజినెస్ స్కూల్‌లో విద్యనభ్యసిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+