భారత మహిళ ఇన్‌స్పెక్టర్‌కు ఐరాస పీస్‌కీపర్ అవార్డు

న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక యుఎన్ ఇంటర్నేషనల్ ఫీమేల్ పోలీస్ పీస్ కీపర్ - 2014 అవార్డును జమ్మూకాశ్మీర్‌కు చెందిన శక్తి దేవీ అనే పోలీస్ ఇన్ స్పెక్టర్ పొందారు. శక్తి దేవీ ఐరాస అసిస్టెన్స్ మిషన్ ద్వారా ఆప్ఘనిస్దాన్‌లో విధులు నిర్వహిస్తున్నారు. ఐక్యరాజ్య సమితి కార్యక్రమ విధుల్లో భాగంగా ఆమె సాధించిన అసాధారణ విజయాలకుగానూ ఈ అవార్డు దక్కించుకున్నారు.

ఆప్ఘనిస్దాన్‌లో లైంగికంగా, లింగ వివక్షతో హింసకు గురయిన బాధితులకు ఆమె అనూహ్యమైన సాయం చేసినట్లు యూఎన్ పోలీస్ విభాగం పేర్కొంది. ఈ నేపథ్యంలో అఫ్ఘనిస్తాన్ లోని పలు ప్రాంతాల్లో మహిళా పోలీస్ కౌన్సిల్స్ ఏర్పాటు చేయడానికి ఆమె ఎంతగానో కృషి చేశారని కొనియాడింది.

Indian cop wins UN's international female peacekeeper awar

కెనాడాలోని విన్నిపెగ్‌లో ఈ నెల మొదట్లో నిర్వహించిన ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ మహిళా పోలీస్ సమావేశంలో ఐక్యరాజ్య సమితి పోలీస్ విభాగం ఆమెకు పురస్కారాన్ని అందజేసింది. ఐరాస శాంతి ఆపరేషన్‌లో విధులను నిర్వహించే మహిళా పోలీసులకు మాత్రమే ఈ అవార్డును అందిస్తారు.

ఈ అవార్డు ముఖ్య ఉద్దేశ్యం ప్రపంచ వ్యాప్తంగా శాంతి భద్రల గురించి ప్రచారం కల్పించడమేనని ఐరాస ప్రతినిధులు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ఐక్యరాజ్య సమితి కార్యక్రమ విధుల్లో మహిళా పోలీసులు చేస్తున్న కృషికి... మహిళలు అధికారుల పాత్రలను అవగాహన పెంచడానికేనని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+