Russia: రష్యాలో కుప్పలు తెప్పలుగా భారత కరెన్సీ.. అదేలాగంటే..!
రష్యాలో భారత కరెన్సీ భారీగా పెరిగిపోయింది. రష్యా భారతీయ బ్యాంకుల్లో బిలియన్ల రూపాయలను పోగు చేసిందని, దానిని ఉపయోగించలేమని ఆ దేశ విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్ చెప్పారు. తమ వద్ద బిలయన్ల కొద్దీ భారత్ కరెన్సీ ఉందని, అది తమకు సమస్యగా మారిందని సెర్గీ లావ్‌రోవ్ అన్నారు. ఈ రూపాయలను మరొక కరెన్సీలలో బదిలీ చేసే విషయమై చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమావేశం సందర్భంగా గోవాలో ఆయన మీడియాతో మాట్లాడారు.
2022-23 ఆర్థిక సంవత్సరం మొదటి 11 నెలల్లో రష్యాకు భారత్ మొత్తం ఎగుమతులు 11.6% తగ్గి $2.8 బిలియన్లకు చేరుకున్నాయి. కానీ దిగుమతులు దాదాపు ఐదు రెట్లు పెరిగి $41.56 బిలియన్లకు చేరుకున్నాయని వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్‌పై దండయాత్రకు ప్రతిస్పందనగా పాశ్చాత్య దేశాలు రష్యా నుంచి చమురు కొనుగోలు నిలిపివేశాయి. దీంతో భారతీయ రిఫైనర్లు రష్యా నుంచి రాయితీ చమురును భారీగా దిగుమతి చేసుకుంటున్నాయి.

డేటా ఇంటెలిజెన్స్ సంస్థ వోర్టెక్సా లిమిటెడ్ ప్రకారం ఇండియాకు రష్యా నుంచి క్రూడ్ దిగుమతులు ఏప్రిల్‌లో రికార్డు స్థాయిలో 1.68 మిలియన్ బ్యారెళ్లకు చేరుకున్నాయి. ఇది అంతకు ముందు సంవత్సరం కంటే ఆరు రెట్లు పెరిగింది. బ్యాంకులపై ఆంక్షలు, స్విఫ్ట్ ఉపయోగించే లావాదేవీల నిషేధం తదితర కారణాల రీత్యా రష్యా భారత్‌ని తమ కరెన్సీలలో వ్యాపారం చేయమని ప్రోత్సహించింది. అయితే యుద్ధం ప్రారంభమైన వెంటనే రూబుల్‌లో అస్థిరత కారణంగా చమురు దిగుమతుల కోసం రూపాయి-రూబుల్ విధానం కోసం ప్రణాళికలు రద్దు చేశారు.
అమెరికా ఆంక్షలతో దక్షిణాసియా దేశానికి రక్షణ సరఫరా నిలిచిపోయినప్పటికీ రష్యా భారతదేశానికి అతిపెద్ద ఆయుధాలు సరఫరాదారుగా నిలిచింది. సాధారణంగా రష్యా కొనుగోళ్లకు రూపాయలను అంగీకరించడానికి ఇష్టపడుదు కానీ యుద్ధ నేపథ్యంలో భారత్ మాత్రమే రష్యా చమురును, ఆయుధాలను కొనుగోలు చేసేందుకు ముందుకు రావడంతో మాస్కోకు ఈ రూపాయల చిక్కు వచ్చి పడింది.
భారతీయ చమురు శుద్ధి సంస్థలు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దిర్హామ్‌లు, రూబిళ్లు, రూపాయిలను ఉపయోగించి రాయితీపై ముడి చమురు కోసం చెల్లింపులను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నాయి. కరెన్సీ పరిమితులు అంటే రష్యన్ ఎగుమతిదారులు రూపాయలను స్వదేశానికి తీసుకురావడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బ్యాంక్ ఆఫ్ రష్యా గవర్నర్ ఎల్విరా నబియుల్లినా ఏప్రిల్ 28న తెలిపారు.












Click it and Unblock the Notifications