Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అమెరికా పారిపోయినా, భారత్ నిలబడే -అఫ్గానిస్థాన్‌‌లో ఎంబసీ మూయలేదు, కాబూల్‌లో సేవలు కొనసాగింపు

భారత్ తో సరిహద్దులు పంచుకునే అఫ్గానిస్థాన్‌ లో పరిస్థితులు మళ్లీ అల్లకల్లోలంగా మారాయి. గెలవలేని యుద్ధాన్ని 20 ఏళ్లపాటు కొనసాగించిన అమెరికా.. ఎట్టకేలకు అఫ్గాన్ నుంచి నిష్క్రమించింది. కనీసం ఆ అఫ్గాన్ సైన్యానికి కూడా సమాచారం ఇవ్వకుండా అమెరికా సేనలు రాత్రికి రాత్రే పారిపోయినంత పనిచేశారు. ఈ దశలో..

అఫ్గానిస్థాన్ నుంచి అమెరికా, మిత్ర దేశాల సైన్యాలు పూర్తిగా వెనక్కి వెళ్లడంతో ఆ దేశంపై మళ్లీ తాలిబన్లు పట్టు బిగిస్తున్నారు. గతంలో స్థావరాలుగా ఉన్న ప్రాంతాలను మళ్లీ వారి అధీనంలోకి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతానికి అఫ్గాన్ సైన్యానికి, తాలిబన్లకు ప్రత్యక్ష యుద్దం ఇంకా మొదలుకానప్పటికీ, పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. దీంతో అప్రమత్తమైన కొన్ని దేశాలు తమ రాయబార కార్యాలయాలను మూసివేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. భారత్ కూడా..

indian-embassy-in-kabul-trashes-reports-of-india-closing-its-missions-in-afghanistan

అఫ్గానిస్థాన్ రాజధాని కాబూల్ లోగల రాయబార కార్యాలయాన్ని భారత్ కూడా మూసేయబోతోందని, కాన్సులేట్‌, రాయబార సిబ్బందిని తిరిగి వెనక్కి రప్పించే ప్రయత్నాలు మొదలుపెట్టిందనే వార్తలు వచ్చాయి. దీనిపై స్పందించిన భారత విదేశాంగశాఖ.. అఫ్గాన్‌లో రాయబార కార్యాలయం, కాన్సులేట్‌లు ప్రస్తుతానికి యథావిధిగా పనిచేస్తాయని ప్రకటించింది. అయినప్పటికీ అక్కడి భద్రతా పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నామని తెలిపింది.

అఫ్గాన్‌ నుంచి అమెరికా సైనిక సేనలు వెళ్లిపోయిన తర్వాత అక్కడ నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా అక్కడ రాయబార కార్యాలయాలు, కాన్సులేట్‌ల భద్రతపై ఆయా దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. తాలిబన్లు దాడులకు తెగబడతారనే భయంతో అఫ్గాన్‌ ప్రభుత్వ అధికారులే తమ కార్యాలయాలను ఖాళీ చేసి వెళ్లిపోతున్నట్లు తెలుస్తోంది. అఫ్గాన్‌ సైనికులు సైతం పక్కనున్న తజకిస్థాన్‌ లాంటి దేశాలకు పారిపోతుండటం అక్కడి పరిస్థితికి అద్దం పడుతున్నది.

తాలిబన్లు మరోసారి విరుచుకుపడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అతి త్వరలోనే తాలిబన్‌ బలగాలు బాగ్రం వైమానిక స్థావరంపై దాడి చేస్తాయని అఫ్గాన్‌ మిలటరీ జనరల్‌ కొహిస్తాని అంచనా వేశారు. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో తాలిబన్ల కదలికలు మొదలయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. విదేశీ బలగాలు వెళ్లిపోయినప్పటికీ బాగ్రం వైమానిక ప్రాంతాన్ని కాపాడుకునేందుకు శాయశక్తులా కృషి చేస్తామని స్పష్టం చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+