• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఐర్లాండ్‌లో జాత్యాంహకారం .. ఇండియన్ ఫ్యామిలీపై తిట్ల దండకం

|

లండన్ : స్వదేశం, విదేశమనే తేడా లేదు. నల్ల జాతీయులపై వివక్ష కొనసాగుతుంది. ఇప్పటికీ కూడా వర్ణ వివక్ష కొనసాగడం ఆందోళన కలిగిస్తోంది. ఆడపా దడపా అమెరికా లాంటి అగ్రరాజ్యంలో నల్ల జాతీయులపై దాడులు జరుగుతున్నాయి. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లోనూ వర్ణ వివక్ష పేరుతో దాడులు చేస్తున్న ఘటనలు మన కళ్లముందు కదలాడుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఐర్లాండ్‌లో భారత సంతతి కుటుంబంపై దాడి జరుగడం కలకలం రేపుతుంది.

Indian family allegedly racially abused on train in Ireland

అవమానం ..

భారత్‌కు చెందిన ప్రసన్ కుటుంబం విడిది కోసం ఐర్లాండ్ వెళ్లింది. అయితే అక్కడ వారికి చేదు అనుభవం ఎదురైంది. వారి రంగును ఉద్దేశించి, జాతిని కించపరుస్తూ కొందరు తమ తలపొగరు ప్రదర్శించారు. అయితే వారు డబ్లిన్ నుంచి రైలులో ప్రయాణిస్తుండగా ఈ ఘటన జరిగిందని వివరించారు. ఈ మేరకు అక్కడి స్థానిక పత్రిక ఐరీష్ టైమ్స్ పేర్కొంది. అక్కడ ఎదురైన అవమానాన్ని ఇమ్మిగ్రెంట్ కౌన్సిల్ అధికారులు ఫిర్యాదు చేశారు.

ఆపని తిట్ల దండకం ...

తమ పేరెంట్స్ తమ కోసం వస్తే ఇలా అవమానించడం సరికాదని ప్రసన్ చెప్తున్నారు. తమ రంగు .. ఆచార వ్యవహారాలకు అడ్డురాదు కదా అని ప్రశ్నించారు. అంతేకాదు వారు రైలులో బీర్ తాగారని కూడా గుర్తుచేశారు. అప్పటికీ తమకు తిడుతూనే ఉన్రాని .. అయితే ట్రైన్ గార్డ్ వచ్చినా ఆపలేదని వాపోయారు. మత్తులో ఉన్న అతన్ని ఆపేందుకు ట్రైన్ గార్డు తనవంతు ప్రయత్నించారని మరో ప్రయాణికుడు పీటర్ తెలిపారు. మత్తులో ఉన్న అతని కూర్చొమని చెప్పాడని .. ఏ సంబంధం లేకుండా ఎందుకు తిడుతున్నావని కూడా ప్రశ్నించారని పేర్కొన్నారు. అయితే బెనర్జీ ప్రయాణం ముగిసేలోపు మాత్రం మత్తు దిగిన యువకుడు క్షమాపణ చెప్పాడని గుర్తుచేశారు. రైలులో జరిగిన ఘటన తమ దృష్టికొచ్చిందని ఐర్లాండ్ అధికారులు పేర్కొన్నారు. దీనికి సంబంధించి సీసీటీవీ ఫుటేజీ చూసి .. దూషించిన వ్యక్తిపై సరైన చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
An Indian family on a vacation to Ireland has been allegedly racially abused in an hour-long tirade against their “accents, skin colour and nationality” by a beer-gulping man on a train to Dublin, according to a media report. Prasun Bhattachrjee, on a three-day visit to Ireland, with his family were on a train from Belfast to Dublin when they were racially abused by another passenger, the Irish Times reported.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more