వగలమారీ పాకిస్తాన్: ఇద్దరు ఇండియన్ హై కమిషన్ సిబ్బంది అరెస్ట్, హిట్ అండ్ రన్ కేసు అట..
పాకిస్తాన్‌లో ఇద్దరు ఇండియన్ హై కమిషన్ సిబ్బందిని అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హిట్ అండ్ రన్ కేసులో వారిని అరెస్ట్ చేసినట్టు పాకిస్తాన్ మీడియా కోడై కూస్తోంది. ఇద్దరు సీఐఎస్ఎఫ్ సిబ్బంది పాదచారులను ఢీ కొట్టి, పారిపోయారని.. ఆ కేసులో అరెస్ట్ చేసినట్టు తెలిపింది. ఈ విషయాన్ని పాకిస్తాన్ విదేశాంగ శాఖ దృష్టికి భారత అధికారులు తీసుకెళ్లారు.
భారత రాయబార కార్యాలయంలో పనిచేసే ఇద్దరు జూనియర్ సిబ్బంది రాయబార కార్యాలయానికి ఉదయం 8.30 గంటలకు బయల్దేరారు. కానీ వారు గమ్యం చేరుకోలేదు. దీనిపై విదేశాంగ శాఖ పాకిస్తాన్‌కు సమన్లు జారీచేసింది. భారత అధికారులను అరెస్ట్ చేసి, వేధించడం సరికాదని అభిప్రాయపడింది. అధికారులను సురక్షితంగా అప్పగించాల్సిన బాధ్యత పాకిస్తాన్‌పై ఉంది ని పేర్కొన్నారు. ఇద్దరు అధికారులను వెంటనే విడుదల చేయాలని కోరింది. గూఢచర్యం ఆరోపణలపై ఇద్దరు పాకిస్తాన్ హై కమిషన్ అధికారులను అదుపులోకి తీసుకున్న తర్వాత ఇస్లామాబాద్‌లో భారతీయ అధికారులను అరెస్ట్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

అబిడ్ హుస్సేన్, మహ్మద్ తాహీర్ అనే ఇద్దరు పాక్ హై కమిషన్ అధికారులను.. గూఢచర్యం పేరుతో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ వెంటనే పాకిస్తాన్.. ఆ దేశంలో ఉన్న ఇండియన్ హై కమిషన్ అధికారులు.. భారతీయ అధికారులను అరెస్ట్ చేశారు. పాకిస్తాన్‌లో ఇండియన్ హై కమిషన్‌లో పనిచేస్తున్న గౌరవ్ అహ్లూవాలియా కారును అక్కడి అధికారులు వెంబడించారు. పాకిస్తాన్ అధికారుల గూఢచర్యంతో అరెస్ట్ చేయడంతో.. ప్రతీగా స్పందించారు.
-
పాకిస్తాన్‌కు ఇరాన్ బిగ్ షాక్.. నో పర్మిషన్.. -
భారత్ కు గుడ్ న్యూస్ చెప్పిన పాకిస్థాన్..! ట్రంప్ సమక్షంలో..! -
ప్రపంచంలోనే అత్యంత 'చెత్త' దేశంగా పాకిస్థాన్ రికార్డు.. -
నన్ను లొంగదీసుకోవడానికి నా భార్యను.. 30 నిమిషాలు పాటు -
మన వాయుసేనలో పాక్ గూఢచారి: దేశ భద్రతను పాకిస్థాన్‌కు తాకట్టు -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..!












Click it and Unblock the Notifications