వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హత్య: అమెరికాలో భారతీయుడికి 82 ఏళ్ల జైలు శిక్ష

By Srinivas
|
Google Oneindia TeluguNews

శాన్‌ఫ్రాన్‌సిస్కో: 2008లో జరిగిన ఓ గొడవలో ఓ వ్యక్తిని హత్య చేసి, మరో వ్యక్తిని గాయపర్చిన వ్యక్తికి అమెరికాలోని న్యాయస్థానం 82 ఏళ్ల జైలు శిక్ష విధించింది. భారత్‌కు చెందిన అమన్‌దీప్‌ సింగ్‌ అనే వ్యక్తికి పరంజీత్ సింగ్‌ అనే మరో భారతీయుడితో వ్యక్తిగత గొడవలున్నాయి.

ఈ నేపథ్యంలో పరంజీత్ సింగ్‌తో కలిసి 2008 ఆగస్టు 31న సక్రామెంటో సిక్కు స్పోర్ట్స్‌ క్లబ్‌లోని ఓ వేడుకకు హాజరయ్యాడు. ఇదే ఫంక్షన్‌కు మరో సన్నిహితుడితో వెళ్లిన అమన్‌దీప్ సింగ్‌ పరంజీత్ సింగ్‌తో గొడవపడ్డాడు. పరంజీత్‌ను తుపాకీతో కాల్చి దారుణంగా హత్య చేశాడు.

Indian Jailed For 82 Years By US Court For Killing Compatriot

హత్య అనంతరం అమన్ సింగ్‌ భారత్‌కు పారిపోయాడు. కేసు విచారణ నేపథ్యంలో.. అమన్‌దీప్‌ను అరెస్టు చేసిన భారత్ అధికారులు అమెరికాకు అప్పగించారు. 2013లో పంజాబ్‌లోని జలంధర్‌లో అతనిని అరెస్టు చేశారు.

అతనిని అమెరికాకు అప్పగించిన అనంతరం.. హత్యానేరం కింద కేసు నమోదు చేసి, విచారణ చేపట్టారు. ఈ కేసులో జనవరి 22న తుది తీర్పు వెలువడింది. అమన్‌దీప్‌ సింగ్‌ను దోషిగా గుర్తిస్తూ సక్రామెంటో కోర్టు 82ఏళ్ల జైలుశిక్ష విధించింది.

English summary
A 30 year old Indian man has been sentenced to 82 years in jail by a US court for killing a compatriot and wounding another during a festival at a Sikh sports complex in Sacramento in 2008.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X