తోటి ఉద్యోగినిని కాపాడిన భారత టెక్కీ, ప్రశంసించిన అమెరికా

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూయార్క్: ప్రమాదంలో చిక్కుకొన్న మహిళను కాపాడేందుకు ఓ భారతీయుడు ప్రదర్శించిన తెగువను అమెరికా సహా యావత్ ప్రపంచం ప్రశంసిస్తోంది. అదే సమయంలో దోపిడికి గురై ఆ యువకుడు చేదు అనుభవానికి గురయ్యాడు. ఈ ఘటన అమెరికాలో చోటు చేసుకొంది. అయితే ఆ యువకుడికి అమెరికా ప్రభుత్వం పురస్కారాన్ని అందించింది.

భారత సంతతికి చెందిన అనిల్ వన్నపల్లి అనే యువకుడు అమెరికాలోని న్యూయార్క్ లో సాప్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. మాన్ హట్టన్ లోని తన కార్యాలయానికి వెళ్ళేందుకు శుక్రవారం నాడు ఎడిసన్ స్టేషన్ కు వెళ్ళాడు.

అనిల్ తో పాటే పనిచేసే మాధురి రేచర్ల కూడ అదే సమయంలో ఎడిసన్ స్టేషన్ కు వచ్చింది. కూతవేటు దూరంలో రైలు ఉండగా ఉన్నట్టుండి మాధురి రైలు పట్టాలపై పడిపోయింది.ఇది గమనించిన అనిల్ తన భుజానికి ఉన్న బ్యాగును ఫ్లాట్ పామ్ పై విసిరేసి ఆమెను కాపాడేందుకు కిందకు దూకాడు.

 Indian man in New York saves co-worker from oncoming train, gets robbed

అప్పటికే మాధురి కాలు విరిగి కదలలేని స్థితిలో ఉంది. ఎలాగోలా ఆమెను పట్టాల నుండి దూరంగా తీసుకు వచ్చాడు అనిల్. ఈ క్రమంలో మరో ఇద్దరు యువకులు అతనికి సహయపడ్డారు. కొద్దిగంటలుగా ఆహారం తీసుకోవడం వల్ల నీరసించిపోయారని ఇందువల్లే కళ్ళుతిరిగి పట్టాలపై పడిపోయానని మాధురి మీడియాకు చెప్పారు.

ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.తనను కాపాడిన అనిల్ కు ఆమె ధన్యవాదాలు తెలిపారు. అయితే ఎడిసన్ స్టేషన్ లో చోటుచేసుకొన్న ఈ ఘటనను అక్కడున్నవారంతా ఉత్కంఠగా గమనించారు. అయితే ఓ దొంగ మాత్రం మాత్రం తాపీగా తనపని తాను చేసుకువెళ్ళాడు.

అనిల్ ఫ్లాట్ ఫాంపై వదిలేసిన బ్యాగును దొంగిలించాడు. అందులో విలువైన ల్యాప్ టాప్ , కొంత డబ్బు, ఐడీ కార్డులున్నాయని చెప్పారు ఎడిసన్ పోలీసులు. తమ ఫేస్ బుక్ పేజీలో ఇలా రాశాడు. దొంగతనాలు జరుగుతూనే ఉంటాయి. కానీ, ఇలాంటి పరిస్థితుల్లో అదికూడ సహయం చేయడానికి ముందుకువచ్చినవారి వస్తువుల్ని తస్కరించడం దారుణమన్నారు.

ప్రాణాలు లెక్క చేయకుండా సాటి మనిషి కోసం సాహసం చేసిన అనిల్ ను అమెరికా పోలీసులు అభినందించారు. ఈ ఘటనలో తన బ్యాగ్ ను కోల్పోయిన అనిల్ కు పరిహాసంగా వెయ్యి డాలర్ల చెక్కును అందించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A 34 year old Indian origin man is being hailed for his courage and rewarded by the police in the US after he saved the life of his woman co-worker from an oncoming train but was robbed of his bag when he jumped on the tracks to help her.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి