Ship hijack: ఆరేబియా సముద్రంలో షిప్ హైజక్.. రంగంలోకి భారత నేవీ..
మాల్టా దేశానికి చెందిన ఓ వాణిజ్య నౌక అరేబియా సముద్రంలో హైజాక్ గురైంది. హైజాక్ ఘటనపై భారత నావికాదళానికి చెందిన యుద్ధనౌక, సముద్ర గస్తీ విమానం వేగంగా స్పందించాయి. సోమాలియా తీరం వైపు వెళుతున్న రుయెన్ ఓడ కదలికను నిరంతరం పర్యవేక్షిస్తోంది. సోమాలియా వెళ్తున్న ఎంవీ రుయెన్ నౌకలోకి కొందరు సముద్రపు దొంగలు వచ్చినట్లు తెలుస్తోంది. 15 డిసెంబర్ తెల్లవారుజామున హైజాక్ కు గురయింది. "ఇది ఇప్పుడు సోమాలియా తీరం వైపు వెళుతోంది" అని భారత నావికాదళం ఒక ప్రకటనలో పేర్కొంది.
యాంటీ పైరసీ పెట్రోలింగ్ కోసం గల్ఫ్ ఆఫ్ ఏడెన్‌లో మోహరించిన ఇండియన్ నేవీ యొక్క యుద్ధనౌక, డిసెంబర్ 16, 23 తెల్లవారుజామున MV రుయెన్‌ను అడ్డగించిందని భారత నౌకాదళం తెలిపింది. నౌకలోకి ఆరుగురు గుర్తుతెలియని వ్యక్తులు ప్రవేశించారని భారత నేవీకి సందేసం రావడంతో నేవీ వేగంగా స్పందించింది. అరేబియా సముద్రంపై గస్తీ కాస్తున్న నావల్ మారిటైం పెట్రోల్ ఎయిర్‌క్రాఫ్ట్, గల్ఫ్ ఆఫ్ ఎడెన్‌లో విధుల్లో ఉన్న యాంటీ పైరసీ పెట్రోల్ యుద్ధ నౌకను అప్రమత్తం చేసింది.

"ఇండియన్ నేవీ MPA డిసెంబర్ 15 తెల్లవారుజామున MV రుయెన్‌ను అధిగమించింది. ఇప్పుడు సోమాలియా తీరం వైపు వెళుతున్న నౌకను పర్యవేక్షించడం కొనసాగిస్తోంది. యాంటీ పైరసీ పెట్రోలింగ్‌పై ఉన్న IN యుద్ధనౌక 16డిసెంబర్ తెల్లవారుజామున MV రుయెన్‌ను అడ్డగించింది. పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నాం" అని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో భారత నావికాదళ ప్రతినిధి తెలిపారు.
హైజాక్ కు గురైన నౌకలో 18 మంది సిబ్బంది ఉన్నట్లు తెలిసింది. సోమాలియా తీరం సమీపంలో అప్రమత్తంగా ఉండాలని యూకే నౌకాదళం సూచించింది. పరిస్థితులు అనుమానాస్పదంగా ఉంటే తక్షణమే రిపోర్ట్ చేయాలని తెలిపింది.












Click it and Unblock the Notifications