ఇరాక్‌లో భారత నర్సులు సేఫ్: ఇంటికి తిరుగుముఖం
న్యూఢిల్లీ: సున్నీ మిలిటెంట్లు బందీలుగా పట్టుకున్న భారత నర్సులు సురక్షితంగా ఉన్నారు. వారిని మిలిటెంట్లు వదిలేశారు. కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాంద్ శుక్రవారం ఆ విషయం చెప్పారు. నర్సులను ఎర్బిల్ విమానాశ్రయానికి తీసుకుని వెళ్తున్నట్లు ఆయన తెలిపారు.
చాలా వారాలుగా 46 మంది భారత నర్సులు తిక్రిత్ ఆస్పత్రిలో బందీలుగా ఉన్నారు. తిక్రిత్ నుంచి మోసుల్‌కు మిలిటెంట్లు వారిని జులై 3వ తేదీన తీసుకుని వెళ్లారు. వారు మోసుల్‌కు ఈ అర్థరాత్రి చేరుకున్నారు.

నర్సులకు మిలిటెంట్లు ఏ విధమైన అపాయం తలపెట్టలేదని, వారిని మోసుల్‌లో రెండు గదుల్లో ఉంచారని సమాచారం. ఎస్కార్ట్స్ వారికి ఆహారం, నీళ్లు అందించారు. నర్సుల పట్ల తొలుత కాస్తా పట్టువిడుపులతో వ్యవహరించినప్పటికీ తర్వాత కఠినంగా మెసిలినట్లు సమాచారం.
శనివారం ఉదయం 7 గంటలకు వారు కేరళలోని కొచ్చి విమానాశ్రయానికి చేరుకునే అవకాశం ఉంది. ఊమెన్ చాందీ శుక్రవారంనాడు విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్‌తో సమావేశమయ్యారు.












Click it and Unblock the Notifications