ప్రపంచ బ్యాంక్ ప్రెసిడెంట్‌గా అజయ్ బంగా: 4 గంటల ఇంటర్వ్యూ తర్వాత ఏకగ్రీవం
వాషింగ్టన్: ప్రపంచ బ్యాంక్ (World Bank) అధ్యక్షుడిగా భారత సంసతికి చెందిన భారతీయ అమెరికన్ వ్యాపారవేత్త అజయ్ బంగా(Ajay Banga) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు 25 మంది సభ్యులతో కూడిన ప్రపంచ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ బోర్డ్ బంగాను నాలుగు గంటలపాటు ఇంతర్వ్యూ చేసింది. అనంతరం ఆయనను ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడిగా ఎన్నుకున్నట్లు ప్రకటించింది.
అజయ్ బంగా సారథ్యంలో పనిచేసేందుకు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నామని ఎగ్జిక్యూటివ్ బోర్డ్ తెలిపింది. అభివృద్ధి చెందుతున్న దేశాలు ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించే లక్ష్యంతో ప్రపంచ బ్యాంక్ లక్ష్యాలను బంగా నెరవేరుస్తారని ఆశిస్తున్నామని ఎగ్జిక్యూటివ్ బోర్డ్ ఒక ప్రకటనలో వెల్లడించింది.

ప్రస్తుతం ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడిగా ఉన్న డేవిడ్ మాల్సాస్ జూన్ 1 వరకు ఆ పదవిలో కొనసాగనున్నారు. జూన్ 2 నుంచి అజయ్ బంగా ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయన ఈ పదవిలో ఐదేళ్లపాటు కొనసాగుతారు. బంగా ప్రస్తుతం జనరల్ అట్లాంటిక్ కంపెనీ వైస్ ఛైర్మన్‌గా ఉన్నారు. గతంలో మాస్టర్‌కార్డ్ ప్రెసిడెంట్, సీఈవోగా కూడా విధులు నిర్వహించారు.
63 ఏళ్ల అజయ్ బంగాకు.. 2016లో పద్మశ్రీ పురస్కారం లభించింది. అత్యంత కీలకమైన ప్రస్తుత సమయంలో ప్రపంచ బ్యాంకును ముందుండి నడిపించగల సామర్థ్యం బంగాకు ఉందని, ఆయనను నామినేట్ చేసిన సమయంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పేర్కొనడం గమనార్హం.
ఫిబ్రవరి చివరలో అజయ్ బంగాను అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ప్రపంచ బ్యాంకు అధ్యక్ష పదవికి నామినేట్ చేశారు. కాగా, భారతదేశంలో జన్మించిన ఆర్థిక, అభివృద్ధి నిపుణుడిగా, వాతావరణ మార్పు, ఇతర ప్రపంచవ్యాప్త సంక్షోభాల వంటి సవాళ్లను ఎదుర్కొనేందుకు సంస్థను పునరుద్ధరించే బాధ్యతను బంగా చేపట్టారు.












Click it and Unblock the Notifications