భారత సంతతి వ్యక్తి దారుణ హత్య: కజినే హంతకుడు
న్యూయార్క్: అమెరికాలో భారత సంతతికి చెందిన వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. అతడితో పాటు గదిలో కలిసి ఉంటున్న కజినే అతికిరాతంగా ఆ వ్యక్తిని పొడిచి చంపేశాడు. మూడు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భారత్‌కు చెందిన శరణ్‌జిత్ సింగ్ 2013లో అమెరికా వెళ్లాడు. ప్రస్తుతం అతడు న్యూయార్క్‌లో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. శరణ్‌జిత్ దగ్గరి బంధువైన లవ్‌దీప్ సింగ్ కూడా గత కొంతకాలంగా అతడితో పాటే ఒకే గదిలో ఉంటున్నాడు.

కాగా, జూన్ 26న ఇద్దరి మధ్య చిన్న గొడవ జరిగింది. దీంతో లవ్‌దీప్.. శరణ్‌జిత్‌పై కత్తితో దాడి చేశాడు. అతడి మెడ, ఛాతీ భాగంలో దారుణంగా పొడిచేశాడు. దీంతో తీవ్రంగా గాయపడిన శరణ్‌జిత్ అక్కడికక్కడే మృతిచెందాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడు లవ్‌దీప్‌ను అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications