యూకేలో హిట్ అండ్ రన్: భారత సంతతి వ్యక్తి మృతి
లండన్: బర్మింగ్‌హామ్ సమీపంలోని హ్యాండ్స్‌వర్త్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో భారతి సంతతికి చెందిన 29ఏళ్ల యువకుడు దుర్మరణం పాలయ్యాడు. రోడ్డు దాటుతున్న సమయంలో ఓ కారు వచ్చి ఢీకొట్టడంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు.
గత కొంత కాలంగా యూకేలో నివసిస్తున్న 29ఏళ్ల రాజేష్ చంద్.. శనివారం తెల్లవారుజామున 4గంటలకు రోడ్డు దాటుతున్న సమయంలో.. అతి వేగంతో వస్తున్న ఓ కారు అతడ్ని ఢీకొట్టి వెళ్లింది. దీంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న మిడ్‌లాండ్స్ పోలీసులు 30ఏళ్ల ఓ అనుమానితుడ్ని అరెస్ట్ చేశారు.

బ్లాక్ ఆడి ఏ4ఎస్ లైన్ ఎస్టేట్ కారు ఈ ప్రమాదానికి కారణమైందని పోలీసులు గుర్తించారు. కారు నెంబర్ ఎన్‌జే60యూఓఎక్స్ అని తెలిపారు. ఈ కారును ఎవరికి, ఎక్కడ కనిపించినా తమకు వెంటనే సమాచారం అందించాలని మిడ్ లాండ్స్ పోలీసులు కోరారు.
దర్యాప్తునుకు రాజేష్ కుటుంబసభ్యులు అవసరమైన సహకారం అందిస్తున్నారని పోలీసులు తెలిపారు. కేసు పరిష్కారం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నామన్నారు. అదుపులోకి తీసుకున్న అనుమానితుడ్ని ప్రశ్నిస్తున్నామని తెలిపారు.












Click it and Unblock the Notifications