• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కామాంధుడికి కఠిన శిక్ష: 13 ఏళ్లు జైలు ...ఇనుప కర్రతో 12 దెబ్బలు విధించిన కోర్టు

|

12 ఏళ్ల బాలికపై అత్యాచారం లైంగిక దాడికి పాల్పడినందుకు భారత్‌కు చెందిన 31 ఏళ్ల వ్యక్తికి 13 ఏళ్లు జైలు శిక్ష విధిస్తూ సింగపూరు కోర్టు తీర్పు వెల్లడించింది. అంతేకాదు ఇనుము కర్రతో 12 దెబ్బలు కూడా కొట్టాలని తీర్పులో పేర్కొంది.

 12 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన ఉదయ్‌కుమార్

12 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన ఉదయ్‌కుమార్

భారత్‌కు చెందిన ఉదయకుమార్ దక్షిణామూర్తి సింగపూర్‌లో ఓ చిన్న షాపింగ్ మాల్‌లో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఓ 12 ఏళ్ల బాలికను పరిచయం చేసుకుని ఆమెకు బహుమతులు ఇచ్చాడు. బయట ప్రపంచానికి తన భార్యగా పరిచయం చేసుకున్నాడు. భార్యగా చెప్పుకుని ఆ చిన్నారిని లొంగదీసుకున్నాడు. మూడునెలలకు పైగా ఆమెపై లైంగికంగా దాడి చేసి అత్యాచారానికి పాల్పడే వాడని స్థానిక పత్రికలు కథనాలు ప్రచురించాయి.

 బాలిక నగ్న వీడియోను తన ఫోనులో చూసిన ఉదయ్ ప్రియురాలు

బాలిక నగ్న వీడియోను తన ఫోనులో చూసిన ఉదయ్ ప్రియురాలు

ఇక ఉదయ్‌కుమార్‌పై మరో నాలుగు ఛార్జి షీట్లు దాఖలయ్యాయి. ఈ చార్జిషీట్లపై సింగపూర్‌లోని హైకోర్టు విచారణ చేసింది. ఈ ఘటన 2016లో సెప్టెంబర్ నుంచి డిసెంబర్‌ మధ్య చోటుచేసుకుంది. అయితే ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. అది కూడా ఉదయ్ కుమార్ సంబంధం నెరుపుతున్న మరో యువతి ఉదయ్ ఫోన్‌లో 12 ఏళ్ల బాలికకు సంబంధించిన నగ్న వీడియో ఉండటంతో ఆయన్ను ప్రశ్నించింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వ్యవహారం బయటపడింది.

సెక్స్ నేర్పిస్తానని మాయమాటలు చెప్పి లైంగిక దాడి

సెక్స్ నేర్పిస్తానని మాయమాటలు చెప్పి లైంగిక దాడి

ఈ కేసును విచారణ చేసిన జడ్జి పాంగ్ ఖాంగ్ చౌ... మైనర్ బాలికను ఉదయ్ కుమార్ లొంగదీసుకున్నాడని, ఆమె అమాయకత్వాన్ని క్యాష్ చేసుకుని లైంగికంగా దాడికి పాల్పడ్డాడని అభిప్రాయపడ్డారు. చిన్నారి జీవితాన్ని నాశనం చేసిన ఈ వ్యక్తికి 13 ఏళ్లు పాటు జైలు శిక్ష విధిస్తున్నట్లు తన తీర్పులో పేర్కొన్నారు. తనతో సెక్స్‌లో పాల్గొనాలని 12ఏళ్ల బాలికతో ఉదయ్‌కుమార్ చెప్పగా...తనకు సెక్స్ అంటే ఏమిటో తెలియదని చిన్నారి చెప్పినట్లు చార్జిషీటులో పోలీసులు పేర్కొన్నారు. సెక్స్ అంటే ఏమిటో నేర్పిస్తానని చెప్పి బాలికపై లైంగిక దాడి చేశారని పోలీసులు వెల్లడించారు.

 కోరిక తీర్చుకునేందుకు చిన్నారికి బొమ్మలు, ఐస్ క్రీములు ఎర

కోరిక తీర్చుకునేందుకు చిన్నారికి బొమ్మలు, ఐస్ క్రీములు ఎర

రెండు సార్లు చిన్నారిపై లైంగికంగా దాడి చేయాలని భావించినప్పటికీ అది సాధ్యం కాలేదని ఆ తర్వాత బహుమతులు ఇచ్చి చిన్నగా బాలికను లొంగదీసుకున్నట్లు ఉదయ్ కుమర్ ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఆ చిన్నారితో లైంగికంగా కలిసిన తర్వాత ఆమెకు ఎలాంటి బహమతులు ఇచ్చేవాడు కాదని పోలీసుల విచారణలో తేలినట్టు లాయరు న్యాయస్థానానికి వెల్లడించారు. తన తొలిపరిచయం తర్వాత బాలికతో చాటింగ్ చేసేవాడని చెప్పిన పోలీసులు ఆ తర్వాత అమ్మాయి నగ్న వీడియోలు ఫోటోలు తనకు పంపాల్సిందిగా కోరేవాడని వెల్లడించారు. ఇందుకు బాలిక ఒప్పుకోకపోవడంతో తను పనిచేసే షాపులో ఐస్‌క్రీములు, ఇతర బొమ్మలు ఉచితంగా ఇచ్చేవాడని పోలీసులు పేర్కొన్నారు. ఇలా ఆ బాలికను మచ్చిక చేసుకుని తనపై లైంగికంగా దాడి చేసినట్లు పోలీసుల విచారణలో ఉదయ్ కుమార్ ఒప్పుకున్నట్లు న్యాయవాది న్యాయస్థానానికి వివరించారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A 31-year old Indian was sentenced to 13 years in jail and 12 strokes of the cane after he pleaded guilty to one charge of sexual assault of a minor and two charges of attempted statutory rape, according to a media report.Udhayakumar Dhakshinamoorthy, a minimart worker, courted a 12-year-old girl with gifts and called her his “wife”, grooming her to engage in progressively intrusive sexual acts with him over a period of three months.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more