ఆ దేశంలో మన టీవీ సీరియళ్లకు.. విపరీతమైన క్రేజ్!

Posted By:
Subscribe to Oneindia Telugu

బీజింగ్: మన దేశ టీవీ సీరియళ్లకు పొరుగు దేశమైన చైనాలో విపరీతమైన ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా భారతీయ పురాణాల ఆధారంగా తెరకెక్కిన మహాభారత్, దేవోంకా దేవ్ మహాదేవ్, నాగిన్ వంటి సీరియళ్లను చైనా వాసులు విపరీతంగా చూస్తున్నారు.

చైనాలోకి సీరియళ్లు దిగుమతి కావడం కొత్త కాదు. అమెరికా, దక్షిణ కొరియా, బ్రిటన్, జపాన్ నుంచి దిగుమతి అయిన సీరియళ్లను వారు బాగానే ఆదరిస్తారు. కానీ ఇటీవల కొత్తగా దిగుమతి అవుతున్న భారతీయ సీరియళ్లు కూడా చైనీయులను బాగా ఆకట్టుకుంటున్నాయని ఆ దేశ ప్రభుత్వ పత్రిక గ్లోబల్ టైమ్స్ ఓ కథనంలో తెలిపింది.

Indian TV dramas Naagin, Mahabharat take China by storm

భారతీయ సీరియళ్లు చైనాలో సూపర్ హిట్ అయినట్లు ఆ పత్రిక తెలిపింది. "భారతీయ పురాణాలు నాకు ఎంతగానో నచ్చుతాయి. వాటి తత్వం, విశాల ప్రాపంచిక దృక్పథం అబ్బురపరిచేలా ఉంటాయి. అవి నాకు సరికొత్త ప్రపంచాన్ని చూపిస్తాయి' అని 29 ఏళ్ల యాంగ్ బూహి తెలిపారు.

గేమింగ్ పరిశ్రమలో పనిచేసే భుహి భారతీయ టీవీ సీరియళ్లకు చైనీస్ సబ్ టైటిల్స్ అందించే వాలంటీర్ గ్రూప్ లో పనిచేస్తున్నారు. 2011లో శివపురాణం ఆధారంగా తెరకెక్కిన దేవోంకా దేవ్ మహాదేవ్ సీరియల్ కు మొదట ఆమె పనిచేశారు. ఈ సీరియల్ లోని మొత్తం 820 ఎపిసోడ్లకు ఆమె చైనీస్ సబ్ టైటిల్స్ అందించారు.

'భారతీయ నటులను నేను ఇష్టపడతాను. ఎంతగా అంటే డబ్బింగ్ చేయకుండా, చైనీస్ సబ్ టైటిల్స్ లేకుండా భారతీయ సీరియళ్లను చూసేంతగా..' అని విద్యారంగంలో పనిచేసే క్వింగ్ క్వింగ్ పేర్కొన్నారు. భారతీయ సీరియళ్ల అనువాదానికి చాలా సమయం పడుతుండటంతో వాటిని నేరుగా చూసేందుకు తాను ఇష్టపడతానని, సీరియళ్లలోని ప్రతినాయకులు సైతం అద్భుతంగా నటించి ఆకట్టుకుంటున్నారని ఆమె వ్యాఖ్యానించడం గమనార్హం.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Mythological dramas from India have become an unlikely rage in China, even prompting groups of young Chinese to start voluntary subtitling groups in an effort to bring the shows to a mass audience.The dramas Naagin, Devon Ke Dev Mahadev, the 2013 series Mahabharat and Buddhaa-Rajaon Ka Raja have all been subtitled into Chinese and viewed by hundreds of thousands of people online. On one of China's widely used video-sharing websites, Bilibili, the first four episodes of Naagin's second season had 1.8 lakh views, reported Chinese media.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి