కాబుల్ లో భారత మహిళ కిడ్నాప్..
కాబుల్ : ఆఫ్ఘానిస్తాన్ రాజధాని కాబుల్ లో ఓ భారతీయ మహిళ కిడ్నాప్ కి గురైంది. కాబుల్ లోని ఓ ఎన్జీవో లొ పనిచేస్తున్న ఆ మహిళను తాయిమని అనే ప్రాంతంలో గురువారం రాత్రి కొంతమంది దుండగులు కిడ్నాప్ చేశారు.
కిడ్నాప్ అయిన మహిళను జుడిత్ డిసౌజా(40) గా గుర్తించారు అక్కడి పోలీసులు. డిసౌజా ఆఘా ఖాన్ అనే ఓ ఎన్జీవో సంస్థతో కలిసి పనిచేస్తున్నట్టుగా సమాచారం. ప్రస్తుతం ఆమె ఆచూకీ కోసం భద్రతా దళాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి.

కోల్ కతాలో ఉండే ఆమె కుటుంబ సభ్యులకు భారత దౌత్య అధికారులు ఎప్పటికప్పుడు సమాచారమందిస్తున్నారు. అలాగే గాలింపు చర్యలు మరింత ముమ్మరం చేసేలా ఆఫ్ఘన్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తోంది.
ఇక దీనిపై స్పందించిన భారత ప్రభుత్వాధికారులు.. కిడ్నాపర్ల చెర నుంచి డిసౌజాను క్షేమంగా బయటికి తీసుకొచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టుగా వెల్లడించారు.












Click it and Unblock the Notifications