భారతీయులకు రష్యా సూపర్ ఆఫర్: వీసా లేకుండానే పర్యటించొచ్చు!

Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ/మాస్కో: అమెరికా, రష్యా, ఆస్ట్రేలియా, బ్రిటన్ లాంటి దేశాలు వీసాలపై ఆంక్షలు విధిస్తుంటే.. రష్యా మాత్రం భారతీయులకు ఓ సూపర్ ఆఫర్ ప్రకటించింది. అదేమంటే..
రష్యాలోని తూర్పు ప్రాంతాల్లో పర్యటించాలనుకొనే భారతీయులు ఎలాంటి వీసా అవసరం లేకుండానే తమ దేశంలోకి రావచ్చని రష్యా ప్రధాని దిమిత్రి మెద్విదేవ్‌ స్పష్టం చేశారు.

Indians can enter Russia's far east without visa: Dmitry Medvedev

ఈ ప్రాంతంలో విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు, పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. తూర్పు రష్యాలో పర్యటించేందుకు వ్యాపారులకు, పర్యాటకులకు ఎలాంటి వీసాలు అవసరం లేదని మెద్విదేవ్‌ చెప్పారు.

ఇందు కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చని ఆయన తెలిపారు.
భారత్ తోపాటు మొత్తం 18 దేశాలకు ఈ వెసులుబాటు కల్పించినట్లు వెల్లడించారు. పెట్టుబడులు, పర్యాటక అభివృద్ధి కోసమే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు మెద్విదేవ్ ప్రకటించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Citizens of India are eligible to visit Russia's far east without visas, Russian Prime Minister Dmitry Medvedev has said.
Please Wait while comments are loading...