Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

విదేశాల నుంచి నౌకల్లో భారతీయుల తరలింపు, ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ క్వారంటైన్ కేంద్రాలు..

విదేశాల్లో ఉన్న భారతీయలను నౌకల ద్వారా తరలిస్తున్నారు. అయితే కరోనా వైరస్ వల్ల వారిని క్వారంటైన్ సెంటర్లలో ఉంచనున్నారు. సౌదీ అరేబియా, కువైట్, యూఏఈ, బహ్రెయిన్, మలేషియా దేశాల నుంచి ప్రజలను తరలిస్తున్నారు. అయితే భారత్ చేరుకున్నాక వారిని ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ క్వారంటైన్ కేంద్రాల్లో ఉంచనున్నారు.

సౌదీ అరేబియా నుంచి వెయ్యి మందిని ఓడల ద్వారా తరలిస్తున్నారు. అయితే తీరం చేరుకున్నాక వారిని 14 రోజులపాటు క్వారంటైన్ చేస్తారు. ఇందుకోసం ఇండియన్ ఆర్మీ ఏర్పాట్లు చేసింది. జోధ్‌పూర్‌లో 500 మంది, జై సల్మేర్‌లో 500 మందికి ఆర్మీ సదుపాయాలు కల్పిస్తోంది. కువైట్ నుంచి 400 మంది వస్తుండగా.. వారిని భోపాల్‌‌లో ఉంచుతున్నారు.వీరికి కూడా ఆర్మీ వసతి కల్పిస్తోంది.

indians will be reach abroad to coastal areas..

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి 200 మందిని కోచ్చి తరలిస్తున్నారు. అక్కడ వీరికి నేవీ క్వారంటైన్ సిద్దం చేసింది. బహ్రెయిన్ నుంచి 150 మంది విశాఖపట్టణం చేరుకోబోతున్నారు. వీరికి కూడా నేవీ ఏర్పాట్లు చేస్తుంది. మలేషియా నుంచి 350 మంది వస్తుండగా.. వీరికి చెన్నైలో ఎయిర్ ఫోర్స్ వసతి కల్పిస్తోంది. వసతి కేంద్రాల్లో వీరికి మౌలిక వసతులు సదుపాయాలు కల్పిస్తారు. క్వారంటైన్ ముగిసాక కూడా కరోనా వైరస్ పరీక్ష చేసి.. నెగిటివ్ వస్తే పంపిస్తారు. పాజిటివ్ వస్తే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+