Emotional Video: " ప్లీజ్.. త్వరగా ఇక్కడినుంచి తీసుకెళ్లిపోండి"
పశ్చిమాసియాలో ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య యుద్ధం మరింత తీవ్రతరం అవుతోంది. ఒకదానిపై మరొకటి క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ లో చిక్కుకున్న భారతీయ విద్యార్థులు తీవ్ర భయాందోళనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇరాన్ లోని పలు పట్టాణాలపై ఇజ్రాయెల్ దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆ పట్టణాల్లో ఉన్న భారతీయ విద్యార్థులు.. భారత ప్రభుత్వం తమను వెంటనే స్వదేశానికి తరలించేలా చర్యలను వేగవంతం చేయాలని కోరుకుంటున్నారు. ఈ మేరకు విద్యార్థులు.. ఎమోషనల్ వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. తమను తక్షణమే స్వదేశానికి తరలించాలని ప్రార్థిస్తూ ప్రధాని మోదీని కోరుకుంటున్నారు.
ఓవైపు వైమానిక దాడులు, భయం మరోవైపు పరీక్ష షెడ్యూల్ కారణంగా ఆందోళనలో ఉన్నట్లు విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భయంతో బతుకుతున్నామని.. ఇక్కడి డైలీ లైఫ్ పూర్తిగా మారిపోయిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు చాలా మంది విద్యార్థులు. ఈ నేపథ్యంలో ఇరాన్ రాజధాని టెహ్రాన్ లో నివసిస్తున్న ఓ భారతీయ విద్యార్థిని సామాజిక మాధ్యమాల్లో పెట్టిన వీడియో ప్రస్తుతం నెటిజన్లను ఎమోషనల్ చేస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
Indian students in Iran say many students have already left the country, while others would like to be evacuated. Term the current situation as one of 'panic' pic.twitter.com/nBj9BGbFmR
— Sidhant Sibal (@sidhant) February 28, 2026
" అందరికీ నమస్కారం.. నేను భారతీయ విద్యార్థిని.. నేను ప్రస్తుతం టెహ్రాన్ లో ఉంటున్నాను. ఇక్కడి వాతావరణం ప్రస్తుతం చాలా భయాందోళనగా మారింది. ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. తర్వాత ఏం జరుగుతుందో ఎవరూ అంచనా వేయలేని పరిస్థితి నెలకొంది" అని ఆ విద్యార్థిని పేర్కొంది.

మరో విద్యార్థిని మాట్లాడుతూ.." భారత ప్రభుత్వం, విదేశాంగ మంత్రిత్వ శాఖ చేస్తున్న తక్షణ చర్యలకు కృతజ్ఞతలు. కానీ ఇలాంటి సమయంలో ఎంత త్వరగా విద్యార్థుల్ని స్వదేశానికి తరలించామన్నదే కీలకంగా మారుతుంది. వైమానిక దాడులు జరుగుతున్నాయి. ఇక్కడి పరిస్థితి దారుణంగా ఉంది. త్వరగా ఇక్కడినుంచి మిమ్మల్ని తరలించాలని వేడుకుంటున్నాం. పరిస్థితి మరింత క్లిష్టతరంగా మారేంతవరకూ వేచి చూడకండి. మిమ్మల్ని కాపాడండి.." అని వీడియోలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ఎమోషనల్ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
'Air strikes are happening, it is getting really worse for us', Indian students in Iran pic.twitter.com/MuirSdblm3
— Sidhant Sibal (@sidhant) February 28, 2026
ఇక ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య భీకర దాడులు జరిగిన విషయం తెలిసిందే. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లోని సుప్రీం లీడర్ ఖమేనీ కార్యాలయాలే లక్ష్యంగా ఇజ్రాయెల్, అమెరికా సైన్యాలు కలిసి దాడులు చేపట్టాయి. ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఇరాన్ తక్షణమే గగనతలాన్ని మూసేసింది. ఆ తర్వాత ఇరాన్ ప్రతీకార దాడులు చేపట్టింది.
-
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
అమెరికా పరువుతీసిన పాకిస్థాన్.. మంత్రి సంచలన ట్వీట్! -
ఇరాన్ సుప్రీం లీడర్ గా ట్రంప్ ? అమెరికా అధ్యక్షుడి తాజా షాక్..! -
ఇరాన్ క్షిపణి దాడిలో బూడిదైన 'స్టాట్యూ ఆఫ్ లిబర్టీ'.. వీడియో వైరల్ -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
మార్కాపురం బస్సు ప్రమాద బాధితుల కోసం ప్రధాని కీలక ప్రకటన..!! -
Donald Trump: పీకల్లోతు కష్టాల్లో ట్రంప్-స్వదేశంలో భారీ షాక్..! -
Trump: నువ్వేగా ఇరాన్ వార్ చేద్దామన్నావ్..! ఆయనపై నెపం నెట్టేసిన ట్రంప్..! -
ఇరాన్ కు కొత్త భద్రతా ఛీఫ్-లారిజానీ స్ధానంలో-ఎవరీ మహమ్మద్ జోల్ఘదర్? -
"అప్పుడు వేరు.. ఇప్పుడు వేరు": భారత్ స్థానం మారింది - ప్రధాని మోడీ












Click it and Unblock the Notifications