భారత్ దెబ్బ.. రెండు నెలలుగా గ్యారేజ్ లోనే పాకిస్థాన్ .. రిపేర్లు చేసుకుంటూ..
జమ్మూ కాశ్మీర్ అనంత్ నాగ్ జిల్లాలోని పహల్గామ్ టూరిస్ట్ ప్రదేశంలో ఉగ్రవాదులు జరిపిన మారణ హోమంలో 26 మంది అమాయక టూరిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ ఈ ఘటన వెనకున్నట్లు తేలింది. అనంతరం పాకిస్థాన్ పై భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. 9 కీలక ఉగ్ర స్థావరాలపై దాడులు చేసింది. వందలాది మంది ఉగ్రవాదులను ఏరివేసింది. ఈ విషయాన్ని భారత రక్షణశాఖ వెల్లడించింది.
అయితే పాక్ పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ దాడిలో పాకిస్థాన్ లోని ఉగ్ర స్థావరాలతో పాటు రహీమ్ యార్ ఖాన్ ఎయిర్ బేస్ కూడా ధ్వంసం అయింది. ఈ విషయాన్ని మొదట పాకిస్థాన్ తిప్పికొట్టినప్పటికీ తర్వాత ధ్వంసం అయినట్టు ఒప్పుకుంది. అయితే ఈ ఘటన జరిగి దాదాపు 3 నెలలు కావస్తున్నా ఈ ఎయిర్ బేస్ మాత్రం రిపేర్ కాకపోవడం గమనార్హం. తాజాగా రహీమ్ యార్ ఖాన్ ఎయిర్ బేస్ ప్రారంభ తేదీని మరోసారి వాయిదా వేసింది పాకిస్థాన్. ఆగస్టు 5 న ఓపెన్ చేస్తామని పేర్కొంది. ఈ ఎయిర్ బేస్ జులై 4 తేదీనే అందుబాటులోకి రావాల్సి ఉన్నప్పటికీ మరమ్మతుల కారణంగా ఇంకా ఓపెన్ కాలేదు.

భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ లో భాగంగా భారత క్షిపణులు ఈ ఎయిర్ బేస్ ను పూర్తిగా ధ్వంసం చేశాయి. దీంతో ఎయిర్ బేస్ ను నిర్మించడం పాకిస్థాన్ కు క్లిష్ట సమస్యగా మారింది. భారత్ దాడులతో ఆ ఎయిర్ బేస్ లోని రన్ వేపై పెద్ద రంధ్రం ఏర్పడింది. ఈ విషయం కొన్ని అంతర్జాతీయ మీడియా సంస్థలు సేకరించిన చిత్రాల ద్వారా తెలుస్తోంది. అంతేకాక ఈ ఎయిర్ బేస్ దగ్గర్లోని ఓ భవనం కూడా కుప్పకూలింది.
మరోవైపు ప్రస్తుతం పాకిస్థాన్లో భారీ వర్షాలకు ఆకస్మిక వరదలు సంభవించాయి. జూన్ 26 నుంచి వరదలు పాకిస్థాన్ ను ముంచెత్తుతున్నాయి. 116 మంది వరదల కారణంగా మృతి చెందారు. మరో 253 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషయాన్ని పాకిస్థాన్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ(NDMA) ధృవీకరించింది. దీంతో ఎయిర్ బేస్ రిపేర్ మరింత సమయం తీసుకుంటోంది.
ఇక పహల్గాం ఉగ్రాదాడి తర్వాత పాకిస్థాన్ పై భారత్ కఠిన ఆంక్షలు విధించింది. సింధూ జలాల పంపిణీ నిలిపివేత, అటారీ వాఘా బోర్డర్ మూసివేత, ఇరు దేశాల మధ్య గగనతలం మూసివేత, ఇరు దేశాల మధ్య ఎగుమతులు దిగుమతులు, రాకపోకలు నిలిపివేత.. తదితర నిర్ణయాలతో పాకిస్థాన్ ఆర్థిక రంగంపై దెబ్బకొట్టింది భారత్.
-
INSPIRING STORY : నాడు రోజుకు రూ.5 రైతు కూలీ.. నేడు ఆక్స్‌ఫర్డ్‌లో "ఏఐ" పై ప్రసంగం..! -
పాకిస్తాన్ ‘డెడ్ లైన్’.. వణుకుతున్న ఐఎస్ఐ అగ్రనేతలు! -
దురంధర్-2కు బిగ్ షాక్.. ఆన్లైన్లో ప్రత్యక్షమైన ప్రింట్! -
ఇగో తగ్గని ప్లేయర్లు.. దిక్కులేని బోర్డు.. పాక్ క్రికెట్‌ను ముంచేది వీళ్లేనా? -
ప్రపంచంలో సంతోషకరమైన దేశం ఇదే.. మారిన లెక్కలు.. -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!?












Click it and Unblock the Notifications