ఘోర విషాదం: 442 మంది దుర్మరణం

ప్రకృతి వైపరీత్యాల కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఇండోనేషియాలో ప్రజల కష్టాలు అధికమవుతున్నాయి. ఇండోనేషియాలోని ఉత్తర సుమత్రా ప్రావిన్స్‌తో పాటు ఇతర ప్రావిన్స్‌లలో కురిసిన భారీ వర్షాల కారణంగా ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటంతో తీవ్ర విధ్వంసం జరిగింది. ఇప్పటివరకు ఇండోనేషియాలో వరదలు, కొండచరియలు విరిగిపడటం వల్ల 442 మంది మరణించారు. ప్రావిన్షియల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ మిటిగేషన్ ఏజెన్సీ ఈ సమాచారాన్ని వెల్లడించింది.

ఉత్తర సుమత్రా ప్రావిన్స్‌లో 217 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆచేహ్ ప్రావిన్స్‌లో 96 మంది మరణించారు. పశ్చిమ సుమత్రా ప్రావిన్స్‌లో 129 మంది మరణించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఏజెన్సీ ముందుగానే అంచనా వేయగా.. ఇప్పుడు అదే జరుగుతోంది. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.

Indonesia Floods and Landslides Claim 442 Lives

402 మంది ఆచూకీ గల్లంతు
వరదలు, కొండచరియలు విరిగిపడిన తర్వాత ఇండోనేషియాలో 402 మంది ఇంకా గల్లంతయ్యారు. నేషనల్ సెర్చ్ అండ్ రెస్క్యూ ఏజెన్సీ ఈ వివరాలను అందించింది. ఉత్తర సుమత్రా ప్రావిన్స్‌లో 209 మంది గల్లంతు కాగా.. ఆచేహ్ ప్రావిన్స్‌లో 75 మంది, పశ్చిమ సుమత్రాలో 118 మంది గల్లంతయ్యారు. ప్రస్తుతం గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. కానీ వాతావరణం అనుకూలించకపోవడం వల్ల సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది.

వందలాది మంది గాయాలు
ప్రావిన్షియల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ మిటిగేషన్ ఏజెన్సీ ప్రకారం.. ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటం వల్ల ఇండోనేషియాలో వందలాది మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో చాలా మందిని చికిత్స కోసం ఆస్పత్రులలో చేర్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+