• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఇండోనేసియా సునామీ బీభత్సం: 832 మంది మృతి, మెరుపు వేగంతో సెన్సర్ల కళ్లుగప్పి...

|

జకర్తా: ఇండోనేసియాలో భారీ భూకంపం, సునామీ ధాటికి 832 మంది చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. 821 మంది పాలూ నగరంలోనే మృతి చెందారని వెల్లడించారు. డొంఘాలా నగరంలో 11 మందిని గుర్తించినట్లు తెలిపారు. సునామీ ధాటికి ఇళ్లు కూలిపోవడంతో పాటు శిథిలాల కింద భారీగా మృతదేహాలు చిక్కుకున్నాయని అనుమానిస్తున్నారు. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని భావిస్తున్నారు.

ఇండోనేసియా హీరో: భూకంపం ధాటికి టవర్ ఊగుతున్నా వందలాదిమందిని కాపాడి, మృతి

సముద్ర తీరం నుంచి 10 నుంచి 20 కిలో మీటర్ల వరకు కొన్ని మృతదేహాలు కొట్టుకు వెళ్లాయి. దీంతోనే సునామీ తీవ్రతను అర్థం చేసుకోవచ్చునని చెబుతున్నారు. వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇండోనేసియా అధ్యక్షులు జోకో విడోడో.. పాలూ నగరానికి వచ్చి పరిస్థితిని పర్యవేక్షించారు.

పాలూతో పాటు ఆ నగరాల్లోను భారీ నష్టం

సునామీకి ముందు సులవేసి దీవిలో సంభవించిన భూకంపం అక్కడ తీవ్రమైన నష్టాన్ని కలిగించింది. భూమికి 10 కి.మీ.లోపల 7.5 తీవ్రతతో ఈ భారీ భూకంపం వచ్చింది. అనంతరం పాలూ నగరంతో పాటు సమీప ప్రాంతాల్లో దాదాపు వందసార్లు భూమి కంపించింది. వీటి వల్ల కూడా భారీ నష్టం జరిగింది. మకాస్సర్‌ నగరం, కలిమంతన్‌ దీవిలో భూకంప ప్రభావం అధికంగా ఉంది. మసీదుల్లో ముస్లీంలు ప్రార్థనలు చేస్తున్న సమయంలో భూమి కంపించింది. పెద్ద ఎత్తున ప్రాణనష్టం సంభవించింది. డొంఘాలా, మామూజు పట్టణాలు కూడా భారీగా దెబ్బతిన్నాయి.

అంతలోనే ఎగిసిపడిన సునామీ

ఇండోనేసియాలో సునామీ సైంటిస్ట్‌ల కంటికి చిక్కలేదా, సెన్సర్ల కళ్లుగప్పి మెరుపు వేగంతో విరుచుకుపడిందా అంటే అవుననే అంటున్నారు. సులవేసి కేంద్రంగా ఈ దారుణం ముంచుకు వచ్చింది. తొలుత పాలూ నగరంలో భారీ భూకంపం వచ్చింది. బీచ్ ఫెస్టివెల్లో ఉన్న జనాలు ఉండగా సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. ఆ తర్వాత ఉపసంహరించుకున్నారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కానీ అంతలోనే 18 అడుగుల ఎత్తులో అలలతో సునామీ విరుచుకుపడింది.

అందుకే హెచ్చరికలు వెనక్కి

అందుకే హెచ్చరికలు వెనక్కి

పాలూ తీరానికి 200 కిలో మీటర్ల దూరంలో అలల తీవ్రతను కొలిచే సెన్సర్లను ఏర్పాటు చేశారు. ఇవి ఇచ్చే సమాచారం ఆధారంగా హెచ్చరికలు జారీ చేస్తారు. భూకంపం తర్వాత ఇక్కడి అలల మట్టంలో కేవలం ఆరు సెంటీమీటర్ల తేడా మాత్రమే కనిపించింది. అసలు భారీ అలలు వస్తున్నట్లు సెన్సర్ల నుంచి సూచనలు రాలేదు. దీంతో సునామీ హెచ్చరికలను వెనక్కి తీసుకున్నారు. కానీ అంతలోనే కనీవినీ ప్రమాదం జరిగింది. హెచ్చరికలు చేసిన కాసేపటికే ఈ ప్రమాదం జరిగింది. అంటే సునామీ మెరుపు వేగంతో విరుచుకుపడినట్లుగా భావిస్తున్నారు. గంటకు కొన్ని వదల కిలో మీటర్ల వేగంతో వచ్చి ఉంటుందని అంటున్నారు.

సునామీ అందుకే వేగంగా చొచ్చుకొని వచ్చిందా?

సునామీ అందుకే వేగంగా చొచ్చుకొని వచ్చిందా?

సాధారణంగా రెండు భూఫలకాలు ఒకదానిపై ఒకటి చొచ్చుకువస్తే సునామీ వస్తుంది. తాజా భూకంపంలో రెండు ఫలకాలూ ఒకదానికొకటి రాసుకుంటూ ఒకటి ముందుకు మరొకటి వెనక్కి కదిలాయి. ఈ కారణంగా ఇంత భారీ సునామీ ఎలా వచ్చిందో తెలియడం లేదని అంటున్నారు. సముద్రం కింద భూమి భారీగా కోతకు గురైనట్లు భావిస్తున్నారు, దీనివల్లే నీరు ఒక్కసారిగా వేరేచోటకు కదిలి సునామీ వచ్చి ఉండవచ్చునని అంటున్నారు. అదే సమయంలో అలలు ప్రయాణించిన మార్గం ఇరుగ్గా ఉండటంతో సునామీ బలం పుంజుకొని ఉండవచ్చునని అంటున్నారు.

English summary
The death toll is currently at 832 and expected to rise sharply. 821 of the deaths occurred in the city of Palu. There are still only 11 casualties recorded in the city of Donggala, one of the worst hit areas.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more