సునామీ విధ్వంసంలో 281కి చేరిన మృతుల సంఖ్య
జకర్తా : ఇండోనేసియాలో సంభవించిన జలప్రళయం విధ్వంసంలో మృతుల సంఖ్య పెరుగుతోంది. సునామీ వచ్చినప్పుడు 222 మంది ప్రాణాలు కోల్పోగా.. ఇప్పుడు ఆ సంఖ్య 281 కి చేరింది. 800 మందికి పైగా గాయపడ్డవారి సంఖ్య వెయ్యికి పైగా చేరుకుంది. గల్లంతయిన మరో 30 మంది వివరాలు తెలియరాలేదు. ఇళ్లు, చెట్లు నేలమట్టం కావడంతో భారీ ఆస్తినష్టం జరిగింది.

అదలావుంటే ఈ ఘటనలో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం ఇంకా పెరిగే అవకాశం కనిపిస్తోంది. రాకాసి అలలు విరుచుకుపడ్డ కారణంగా పెద్దసంఖ్యలో నిరాశ్రయులయ్యారు. వీరికి ఆశ్రయం కల్పించేందుకు అక్కడి ప్రభుత్వం చర్యలు తీసుకుంటొంది. అలాగే సహాయక చర్యలను ముమ్మరం చేసింది. గాయపడ్డవారికి మెరుగైన వైద్యం అందిస్తోంది.












Click it and Unblock the Notifications