కాశ్మీర్ ఇష్యూ: భారత్‌కు వ్యతిరేకంగా షాహిద్ అఫ్రీది వ్యాఖ్యలు
ఇస్లామాబాద్: పాకిస్తాన్ స్టార్ క్రికెటర్ షాహిద్ అప్రీది భారత్‌కు వ్యతిరేకంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాశ్మీర్‌లో అమాయకులను చంపుతున్నారని, ఐక్య రాజ్య సమితి దీనిని ఎందుకు అడ్డుకోవడం లేదని ప్రశ్నించారు.
కాశ్మీర్‌లోని పరిస్థితులపై ఆయన మండిపడ్డారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా కాశ్మీర్ విషయంలో ఐక్య రాజ్య సమితి జోక్యం సరిగా లేదని అభిప్రాయపడ్డారు.

ఆక్రమిత కాశ్మీర్‌లో ఆందోళనకర పరిస్థితులు ఉన్నాయని, అమాయకులు చనిపోతున్నారని, ఐక్యరాజ్య సమితితో పాటు మిగతా సంస్థలు ఏం చేస్తున్నాయని ఆయన ప్రశ్నించారు. ఈ రక్తపాతాన్ని వారు ఎందుకు ఆపలేకపోతున్నారని ట్వీట్ చేశారు.












Click it and Unblock the Notifications